Share News

YSRCP: కూటమి ప్రభుత్వం చార్జీలు పెంచడానికి సిద్ధమైంది... వైసీపీ నేత సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Dec 01 , 2024 | 09:25 PM

ప్రజలకు కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్ధమైందని పెందుర్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఆక్షేపించారు. తల్లికి వందనం పేరుతో ఎంత మంది ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారని.. ఇప్పటివరకు ఎవరికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

YSRCP: కూటమి ప్రభుత్వం  చార్జీలు పెంచడానికి సిద్ధమైంది... వైసీపీ నేత సంచలన ఆరోపణలు

విశాఖపట్నం: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు మాట తప్పుతున్నారని పెందుర్తి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కరెంట్ చార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు చార్జీలు పెంచడానికి సిద్ధం అవుతున్నారని ఆరోపించారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్ధమైందని ఆక్షేపించారు. ఇవాళ(ఆదివారం) విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై అదీప్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. తల్లికి వందనం పేరుతో ఎంత మంది ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామని చెప్పారని.. ఇప్పటివరకు ఎవరికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వలంటీర్లకు ఇచ్చిన మాట తప్పారని.. బెల్ట్ షాపులు కూడా ఎక్కడపడితే అక్కడ కనబడుతున్నాయని అదీప్ రాజు మండిపడ్డారు.


దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి: ఎంపీ, వైఎస్ఆర్‌సీపీ నేత మద్దిల గురుమూర్తి

మరోవైపు.. దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు సభ్యుల పని తీరును ప్రభావితం చేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రానికి తిరుపతి ఎంపీ, వైఎస్ఆర్‌సీపీ నేత మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజజుకి ఎంపీ గురుమూర్తి ఆదివారం లేఖ రాశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు అనే పుస్తకంలో ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆయన రాసిన లేఖలో ప్రస్తావించారు.


1968లో లోక్‌సభలో స్వతంత్ర సభ్యుడు ప్రకాశ్ వీర్ శాస్త్రి ప్రైవేట్ మెంబర్ బిల్లు సైతం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల జాతీయ సమగ్రత మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు. వాతావరణ ప్రతికూలతలు లేక పోవడం వల్ల పార్లమెంట్‌లో ఉత్పాదకత కూడా పెరుగుతుందని ఆయ పేర్కొ్న్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇటీవల ప్రారంభమైనాయి. ఇవి డిసెంబర్ 20వ తేదీ వరకు జరగనున్నాయి.

Updated Date - Dec 01 , 2024 | 09:26 PM