Share News

Anitha: ఏపీలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:00 PM

ఏపీలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anita) వ్యాఖ్యానించారు.

Anitha: ఏపీలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం
Home Minister Vangalapudi Anitha

విశాఖపట్నం: ఏపీలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. కానిస్టేబుల్‌పై మద్యం మత్తులో యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే విశాఖలోని సెవెన్ హిల్స్ హస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పారావును ఈరోజు(ఆదివారం) హోమంత్రి అనిత పరామర్శించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ... ఈ కేసులో నిందితుడికి చట్ట ప్రకారమే కఠినంగా శిక్ష ఉంటుందని తెలిపారు. పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పని చేయాలని సూచించారు. కానిస్టేబుల్ అప్పారావు కుటుంబానికి అండగా ఉంటామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు

Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్

Harish Rao:రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

Rakesh Reddy: నిరుద్యోగులపై రేవంత్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 03:35 PM