Share News

Ayyannapatrudu: వెంకయ్య నాయుడు యువ ఎమ్మెల్యేలకు సలహాలు ఇవ్వాలి

ABN , Publish Date - Jul 12 , 2024 | 08:52 PM

కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Ayyannapatrudu ) ప్రసంగాలు వింటే చాలు రాజకీయాల్లో ఎదుగుతారని చెప్పారు.

Ayyannapatrudu:   వెంకయ్య  నాయుడు యువ ఎమ్మెల్యేలకు సలహాలు ఇవ్వాలి
Ayyannapatrudu

విశాఖపట్నం: కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. కొత్త ఎమ్మెల్యేలు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Ayyannapatrudu ) ప్రసంగాలు వింటే చాలు రాజకీయాల్లో ఎదుగుతారని చెప్పారు. ఈరోజు(శుక్రవారం) రుషికొండ ఏ 1కన్వెన్షన్ సెంటర్‌లో వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రకు ఆప్తుడుగా వెంకయ్య నాయుడు ఉన్నారంటే అది ఏపీ అదృష్టమని కొనియాడారు. తన బాడీ లాగ్వేంజ్‌కి, తనకు లభించిన కుర్చీకి సరిపోలడం లేదని.. కానీ తన కుర్చీకి ఏమాత్రం అగౌరవం రాకుండా చూసుకుంనని ఉద్ఘాటించారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ క్యాంపులు పెట్టబోతున్నామని .. వారికి వెంకయ్యనాయుడు వచ్చి తర్ఫీదు ఇవ్వాలని కోరుతున్నామని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.


విశాఖకు ఆ ఘనత వెంకయ్యనాయుడు పుణ్యమే: హరిబాబు

ఏపీ విభజన జరిగినప్పుడు ఏరకమైన నష్టం వస్తుందో గ్రహించి అనేక ప్రతిపాదనలు సాధించిన ఘనత వెంకయ్యనాయుడుది అని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు (Governor Mizoram Dr. Kambhampati Haribabu) వ్యాఖ్యానించారు. తెన్నేటి విశ్వనాధం , గౌతులచ్చన్న వంటి యోధులవద్ద వారి జీవనం మొదలైందని చెప్పారు. దేశంలో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన మూడు నగరాల్లో విశాఖకు స్థానం లభించిందంటే వెంకయ్యనాయుడు పుణ్యమేనని కొనియాడారు. గ్రామాల్లో నూటికి నూరు శాతం రోడ్ల నిర్మాణాలకు వెంకయ్యనాయుడు రూపకల్పన చేశారని కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు.


వెంకయ్యనాయుడు ప్రసంగాలు స్ఫూర్తిదాయకం: అనిత

వెంకయ్యనాయుడు క్రమశిక్షణకు మారుపేరు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విద్యార్థి స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్లారని చెప్పారు. వెంకయ్యనాయుడు ప్రసంగాలు స్ఫూర్తిదాయకమని ఎందరో నేతలకు ఆదర్శమని చెప్పారు.

Updated Date - Jul 12 , 2024 | 08:59 PM