Share News

AP News: జగన్ పర్యటన.. ప్రజల ఆవేదన.. ఏం జరిగిందంటే?

ABN , Publish Date - Mar 07 , 2024 | 11:56 AM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. సీఎం పర్యటించే చోట పోలీసుల ఆంక్షలు వర్ణణాతీతం. తీవ్రమైన ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు అష్టకష్టాలు ఎదుర్కున్న పరిస్థితులు ఉన్నాయి. తాజాగా అనకాపల్లిలోనూ అదే పరిస్థితి నెలకొంది. జగన్ పర్యటన సందర్భంగా విశాఖ - తుని రూట్లలో పోలీసులు తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ట్రాఫిక్‌ను మళ్లించారు.

AP News: జగన్ పర్యటన.. ప్రజల ఆవేదన.. ఏం జరిగిందంటే?

అనకాపల్లి, మార్చి 7: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పర్యటన ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. సీఎం పర్యటించే చోట పోలీసుల ఆంక్షలు వర్ణణాతీతం. తీవ్రమైన ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు అష్టకష్టాలు ఎదుర్కున్న పరిస్థితులు ఉన్నాయి. తాజాగా అనకాపల్లిలోనూ (Anakapalli) అదే పరిస్థితి నెలకొంది. జగన్ పర్యటన సందర్భంగా విశాఖ - తుని రూట్లలో పోలీసులు తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ట్రాఫిక్‌ను మళ్లించారు. రోడ్లపై కిలోమీటర్ల పొడుగునా వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన జరిపినప్పుడల్లా తమకు ఎందుకు ఇబ్బందులు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి తుని వైపు జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనాలు లంకెలపాలెం జంక్షన్ పరవాడ, అచ్యుతాపురం, ఎలమంచిలి మీదుగా తునికి మళ్లించారు. తుని నుంచి విశాఖపట్నం వచ్చే వాహనాలు అచ్యుతాపురం, పరవాడ, లంకెలపాలెం మీదుగా విశాఖకు మళ్లించారు.

ఇవి కూడా చదవండి...

Bhuvaneswari: అనంతలో ఏయే ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటిస్తారంటే?

AP News: కోడికత్తి టవర్.. సోషల్ మీడియాలో జగన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 07 , 2024 | 12:01 PM