Students: ఆందోళన విరమించిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ విద్యార్థినిలు
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:36 PM
Andhrapradesh: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినిలు ఆందోళనను విరమించారు. కళాశాల హాస్టల్ వాష్ రూమ్‌ల్లో హిడెన్ కెమెరాల ఘటన కలకలం రేపింది. తమ జీవితాలను నాశనం చేశారంటూ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఒక విద్యార్థి, విద్యార్ధినులు కలిసి కెమెరా అమర్చారని వారు ఆరోపించారు.
కృష్ణాజిల్లా, ఆగస్టు 30: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినిలు ఆందోళనను విరమించారు. కళాశాల హాస్టల్ వాష్ రూమ్‌ల్లో హిడెన్ కెమెరాల ఘటన కలకలం రేపింది. తమ జీవితాలను నాశనం చేశారంటూ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఒక విద్యార్థి, విద్యార్ధినులు కలిసి కెమెరా అమర్చారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆదేశాలతో దిగిన మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే లు కుమార్ రాజా, వెంకట్రావు, కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు.
Jethwani Case: హీరోయిన్ జిత్వానీ వ్యవహారంలో షాకింగ్ విషయం బయటపెట్టిన కింద స్థాయి అధికారులు
విద్యార్ధినులతో మంత్రి కొల్లు రవీంద్ర పలు దఫాలుగా చర్చలు జరిపారు. మంగళవారం నాటికి విచారణ పూర్తి చేసి, బాధ్యులను శిక్షిస్తామని వారు హామీ ఇచ్చారు. ఎటువంటి వీడియోలు బయటకు రానీయకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. హాస్టల్‌లో విద్యార్దినులకు రక్షణగా మహిళా పోలీసు టీంను ఏర్పాటు చేశారు. మంత్రి రవీంద్ర హామీలకు అంగీకరించిన విద్యార్థినులు తమ ఆందోళనను విరమించారు. విచారణ పూర్తి అయ్యే వరకు తరగతులకు హాజరుకాకూడదని విద్యార్ధినిలు నిర్ణయించారు.
ఎస్పీ ప్రకటనపై...
కాగా... కాలేజీలోని బాలికల హాస్టల్‌లో వాష్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు రాత్రి నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో కాస్త సద్దుమణిగినా.. తిరిగి ఇవాళ ఉదయం ఆందోళన ప్రారంభమైంది. తమకు న్యాయం చేయాలంటూ విద్యా్ర్థులు నినాదాలు చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ అంటూ ధర్నా చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు స్లోగన్స్ ఇస్తున్నారు. అయితే గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో సీసీ కెమెరాలు ఎక్కడా కనిపించలేదంటూ ఇవాళ ఉదయం జిల్లా ఎస్పీ ఒక ప్రకటన జారీ చేశారు. దీనిపై విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఎస్పీ ప్రకటనతో విద్యార్థినులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. చివరకు మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చిన హామీతో విద్యార్థినులు ఆందోళనను విరమించారు.
మరోవైపు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా స్పందిస్తూ... తీవ్రంగా ఖండించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాము గురువారం రాత్రి కళాశాలలో జరిగి పరిణామాలపై తాజాగా స్పందించారు.
ఇవి కూడా చదవండి..
Lokesh: ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలపై లోకేష్ స్పందన
TG Bharath: చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి 30ఏళ్లు..
Read Latest AP News And Telugu News