Share News

Kadambari Jethwani: ముంబై నటి స్టేట్‌మెంట్ రికార్డు.. కన్నీరు పెట్టుకున్న జిత్వానీ

ABN , Publish Date - Aug 30 , 2024 | 11:52 AM

Andhrapradesh: విజయవాడలోని ఓ హోటల్‌‌లో ఉన్న ముంబై నటి జిత్వానీ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే విచారణాధికారి స్రవంతి రాయ్ హోటల్‌కు చేరుకున్నారు. విచారణ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నారు. జిందాల్‌‌పై అత్యాచారం కేసు నుంచి వరుసగా జరిగిన ఘటనలు వివరించినట్లు సమాచారం.

Kadambari Jethwani: ముంబై నటి స్టేట్‌మెంట్ రికార్డు.. కన్నీరు పెట్టుకున్న జిత్వానీ
Actress Jithwani

అమరావతి, ఆగస్టు 30: విజయవాడలోని ఓ హోటల్‌‌లో ఉన్న ముంబై నటి జిత్వానీ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. ఇప్పటికే విచారణాధికారి స్రవంతి రాయ్ హోటల్‌కు చేరుకున్నారు. విచారణ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నారు. జిందాల్‌‌పై అత్యాచారం కేసు నుంచి వరుసగా జరిగిన ఘటనలు వివరించినట్లు సమాచారం. విటిపియస్ గెస్ట్ హౌస్‌లో బంధించిన సమయంలో ఏయే పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో చెప్పి నటి కన్నీటి పర్యంతమయ్యారు. రేప్ కేసు పెట్టిన డిసెంబరు 2023 నుంచి కేసు కొట్టేసిన మార్చి 2024 వరకు జరిగిన ఘటనలు పోలీసులకు జిత్వానీ వివరించారు. ఆమె చెప్పిన అంశాలను స్టేట్‌మెంట్ రూపంలో, వీడియో రూపంలో విచారణ అధికారులు తీసుకున్నారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం జోడించి దర్యాప్తు చేస్తున్నారు.

Kolkata: పిల్లలు లేని ఆమెకు.. మా బాధ ఎలా తెలుస్తుంది.. మమతపై మండిపడిన అభయ తల్లి


కాగా... ముంబై నటి, వైద్యురాలు కాదంబరి జిత్వానీని తప్పుడు కేసులో ఇరికించి, ఆమె కుటుంబ సభ్యులనూ అరెస్టు చేసి, అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టిన కేసులో సీనియర్‌ ఐపీఏఎస్‌ల పాత్ర తేల్చేందుకు రంగం సిద్ధమైంది. రెండు తెలుగురాష్ట్రాలతో పాటు... ముంబైలో, సినీ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు విచారణాధికారిగా విజయవాడ ఏసీపీ కె.స్రవంతి రాయ్‌ని నియమించింది. డీజీపీ ఆదేశాల మేరకు విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖర బాబు గురువారం (ఆగస్టు 29) ఈ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు నటి కాదంబరిపై కుక్కల విద్యాసాగర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేయడం... ఆ మరుసటి రోజునే ముంబైలో ఏపీ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏపీలో తనను వేధించిన తీరుపై ఆగస్టు 1వ తేదీన ముంబై జుహూ పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.

CM Revanth Reddy: నా వ్యాఖ్యలు వక్రీకరించారు... సుప్రీం కోర్టు సీరియస్‌ కావడంపై రేవంత్



‘‘నన్ను, నా తల్లిదండ్రులను ఏపీ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 3న అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2న ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, 24 గంటల్లోనే రోడ్డు మార్గాన విజయవాడ నుంచి ముంబై వచ్చి ఎలాంటి ఆధారాలు లేకున్నా అరెస్టు చేశారు. ఆ సమయంలో మా లాయర్‌ను కానీ, బంధువులను కానీ సంప్రదించే అవకాశం కల్పించలేదు. విజయవాడ తీసుకెళ్లిన తర్వాత కూడా మాకు లాయర్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. మా అరెస్టు సమాచారాన్ని బంధువులకు తెలియజేశామని ఏపీ పోలీసులు చెప్పడం పెద్ద అబద్ధం. అలాగే... మా నివాసం నుంచి ఓ డాక్యుమెంట్‌ను రికవరీ చేశామని, దాని ఆధారంగానే అరెస్టు చేశామని చెబుతున్నారు. దానిని సృష్టించింది కూడా పోలీసులే. 2018లో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు ఆ డాక్యుమెంట్‌లో ఉంది. కానీ... అందులోని చిరునామా మాత్రం 2020లో నేను జుహూలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ది. అంతేకాదు... ఆ డాక్యుమెంట్‌ పేపర్‌ను 2023లో కొన్నారు. అది ఫోర్జరీ అని చెప్పేందుకు ఇవే నిదర్శనాలు’’ అని ఆ ఫిర్యాదులో కాదంబరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

AP Govt: ఒకే కాంట్రాక్టర్‌కు రూ.64 కోట్ల చెల్లింపులు... ఆర్థిక శాఖలో బయటపడుతున్న వాస్తవాలు

Budda Venkanna: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 30 , 2024 | 12:30 PM