Share News

Visakha: విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:02 PM

దుర్గారావు, సుష్మిత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అనంతరం ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పారు. అయితే పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి.

Visakha: విశాఖలో ప్రేమ జంట ఆత్మహత్య.. ఏం జరిగిందంటే..

విశాఖ: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ జంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. అమలాపురానికి చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మిత కుటుంబాలు విశాఖ షీలానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాయి. దుర్గారావు క్యాటరింగ్ పని చేస్తుండగా.. సాయి సుష్మిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో వారి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది.


దుర్గారావు, సుష్మిత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అనంతరం ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పారు. అయితే పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. ఈ క్రమంలో తీవ్రమనస్తాపానికి గురైన ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దుర్గారావు అద్దెకు ఉంటున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యకు ముందు షీలానగర్‌లోని బినాయక్ క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్న ప్రేమికుడు దుర్గారావు ఇంటికి సుష్మిత వెళ్లింది. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.


అయితే స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం అపార్ట్‌మెంట్ లోపలికి వెళ్లి గాజు గ్లాసు, టీవీ రిమోట్ పగిలిపోయి ఉండడాన్ని గుర్తించారు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మృతురాలు సుష్మిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దుర్గారావు ఫోన్ మాత్రం ఓపెన్ అవ్వలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం కారణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Aliya Fakhri Arrest: బాలీవుడ్ నటి సోదరి అరెస్టు.. వివరాలు ఇవే..

Tamil Nadu: ఘోరం.. కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన..

Updated Date - Dec 03 , 2024 | 12:10 PM