Share News

AP NEWS: ఆ ఎమ్మార్వో హత్య వెనుక ఉన్నది వారే..: పల్లా శ్రీనివాస్

ABN , Publish Date - Feb 03 , 2024 | 08:39 PM

ప్రశాంతమైన విశాఖ ప్రాంతంలో దోపిడీ దౌర్జన్యాలు, హత్యలు విపరీతంగా జరుగుతున్నాయని టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు(Palla Srinivasa Rao) అన్నారు. ఎమ్మార్వో హత్య చేసింది.. వైసీపీ వ్యక్తిగా అనుమానిస్తున్నారని అన్నారు.

AP NEWS: ఆ ఎమ్మార్వో హత్య వెనుక ఉన్నది వారే..: పల్లా  శ్రీనివాస్

విశాఖపట్నం: ప్రశాంతమైన విశాఖ ప్రాంతంలో దోపిడీ దౌర్జన్యాలు, హత్యలు విపరీతంగా జరుగుతున్నాయని టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు(Palla Srinivasa Rao) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మార్వో హత్య చేసింది.. వైసీపీ వ్యక్తిగా అనుమానిస్తున్నారని అన్నారు. విశాఖలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని పులివెందుల పంచాయతీ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు అధికారులతో తప్పులు చేయిస్తున్నారని.. వాటి పర్యవసానమే ఈ హత్య జరిగిందని చెప్పారు. మండల ప్రజా అధికారిని ఇంటికి వెళ్లి చంపేశారు అంటే విశాఖలో ఎప్పుడు జరగలేదని.. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఎమ్మార్వోను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఆ హత్య వెనుక ప్రభుత్వ పెద్దలు: గండి బాబ్జి

జగన్ బంధువులు, రాయలసీమ బ్యాచ్ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి(Gandi Babji) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్వో హత్య , ప్రభుత్వం హత్య అని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాలను ప్రోత్సహించే వారిని కూడా శిక్షించాలని కోరారు. హత్యలు, అఘాయిత్యాలు కబ్జాలు వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు.

Updated Date - Feb 03 , 2024 | 08:39 PM