Share News

AP NEWS: ఎమ్మెల్యే వెలగపూడికి బెదిరింపుల ఫోన్లు.. ఆయన ఏం చేశారంటే..?

ABN , Publish Date - Feb 27 , 2024 | 07:17 PM

సైకో పాలనలో విశాఖలో సుమారు 50 హత్యలు జరిగాయని తూర్పు నియోజవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు(MLA Velagapudi Ramakrishna Babu) ఆరోపించారు. మంగళవారం నాడు తనకు వస్తున్న ఫోన్ కాల్స్ బెదిరింపులపై నగరపోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 24, 25 తేదీల్లో రాత్రివేళ వచ్చిన ఇటర్నేషనల్ కాల్స్ నెంబర్లతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు‌‌ చేశారు.

AP NEWS: ఎమ్మెల్యే వెలగపూడికి బెదిరింపుల ఫోన్లు.. ఆయన ఏం చేశారంటే..?

విశాఖపట్నం: సైకో పాలనలో విశాఖలో సుమారు 50 హత్యలు జరిగాయని తూర్పు నియోజవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు(MLA Velagapudi Ramakrishna Babu) ఆరోపించారు. మంగళవారం నాడు తనకు వస్తున్న ఫోన్ కాల్స్ బెదిరింపులపై నగరపోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 24, 25 తేదీల్లో రాత్రివేళ వచ్చిన ఇటర్నేషనల్ కాల్స్ నెంబర్లతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు‌‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ..ఈనెల 26వ తేదీన ఎంవీపీ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టాలని కోరారు. ఫోన్‌లో తనను చంపేస్తామని, నరికేస్తామని దుర్భాషలాడారని చెప్పారు. తనకు ఫోన్ చేసిన వ్యక్తులు ఉత్తరాంధ్ర వ్యక్తులు కాదని ఇలాంటి విష సంస్కృతి తాను ఎప్పుడు చూడలేదని అన్నారు.

ప్రశాంతంగా ఉన్న విశాఖ సైకో పాలనలో గంజాయి వనంలా మారిందని మండిపడ్డారు. రౌడీ షీటర్లు మరణిస్తే కత్తులు పట్టుకుని ర్యాలీలు చేయడం చూస్తున్నామని అన్నారు. జగన్ పాలనలో ప్రజా ప్రతినిధులు కుటుంబానికే రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఎవరితో వ్యక్తిగత తగాదాలు లేవని.. ఇది వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని కచ్చితంగా చెబుతున్నానని అన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్.ఐ. ఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ చెప్పారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 27 , 2024 | 07:21 PM