Share News

YSRCP: సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుల అరాచకం

ABN , Publish Date - Jul 01 , 2024 | 06:50 PM

గత ఐదేళ్లు వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాయకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు.

YSRCP: సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుల అరాచకం

విశాఖపట్నం: గత ఐదేళ్లు వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాయకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా భీమిలి నియోజవర్గ పరిధి ఐదో వార్డ్ 35వ సచివాలయం సిబ్బందిపై వైఎస్సార్సీపీ నాయకులు అరాచకం సృష్టించారు. అడ్మిన్ పై వైఎస్సార్సీపీ నాయకుడు బోయ సూరి రెడ్డి అసభ్యకర మాటలతో బెదిరింపులకు దిగాడు.


ఈమేరకు శివ ప్రసాద్ (35 వ సచివాలయం అడ్మిన్ ) మీడియాతో మాట్లాడారు. తమకు వచ్చిన ఆదేశాలకనుగుణంగా పెన్షన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ విషయమై స్థానిక టీడీపీ నేతల వద్దకు వెళ్లానని తెలిపారు. ఆ విషయమై కొంతమంది వైసీపీ నాయకులకు నచ్చలేదని అన్నారు. తనపై సూరి రెడ్డి అనే వైసీపీ నేత తనను కొట్టడానికి కూడా వచ్చారని అంతే కాకుండా కొంతవరకు వెంబడించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ప్రభుత్వ అధికారినని పార్టీలకు సంబంధం లేదని కూడా చెప్పానని అన్నారు. తనపై, తనకుటుంబంపై కూడా దుర్భాషలాడారని శివ ప్రసాద్ పేర్కొన్నారు.

Updated Date - Jul 01 , 2024 | 07:00 PM