MP Appalanaidu: జగన్ మాటలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది: ఎంపీ అప్పలనాయుడు
ABN , Publish Date - Jun 20 , 2024 | 06:01 PM
తాడేపల్లి(Tadepalli)లో నిర్వహించిన వైసీపీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్(Jagan) మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావాల్సి వస్తుందనే బాధ ఆయన మాటల్లో కనిపిస్తోందని కలిశెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అమరావతి: తాడేపల్లి(Tadepalli)లో నిర్వహించిన వైసీపీ(YSRCP) విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్(Jagan) మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావాల్సి వస్తుందనే బాధ ఆయన మాటల్లో కనిపిస్తోందని కలిశెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రుషికొండ ప్యాలెస్ విలాసాలను ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రజలు చూసుంటే ఫలితాల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యేదని అన్నారు. రుషికొండ ప్యాలెస్‌లోకి వెళ్లలేకపోయాననే బాధ మాజీ ముఖ్యమంత్రి జగన్‌లో కనిపిస్తోందని చెప్పారు.
జీవితాంతం ఉండాలని కట్టుకుంటే తనకు దక్కకుండాపోయిందనే అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. జగన్ పథకాల ద్వారా సంక్షేమ పాలన అందిస్తే ప్రజలు ఓట్లు ఎందుకు వేయలేదు.. సీట్లు ఎందుకు రాలేదు? అని ఎంపీ కలిశెట్టి ప్రశ్నించారు. జగన్ వల్లే తాము ఓడిపోయామని చాలా మంది వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేయడం లేదని ప్రజలు అప్పుడే అనుకుంటున్నారని జగన్ ఎలా కామెంట్ చేయగలిగారో అర్థం కావడం లేదన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజాదీవెన పుష్కలంగా ఉందని ఎంపీ కలిశెట్టి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
Fire Accident: నెల్లూరులో దారుణం.. మంటల్లో చిక్కుకుని బాలిక మృతి..
MLA Srinivasa Rao: పీఎం పాలెం టిడ్కో ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు