Share News

MLC Election:విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:14 AM

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ(శనివారం) షెడ్యూల్‌ విడుదల అయింది ఈరోజు నుంచి విజయనగరం జిల్లాలో ఎన్నికల నియమావళి అమలు కానుంది. ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

MLC Election:విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

విజయనగరం: విజయనగరంస్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు హడావిడి మొదలైంది. శనివారం నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. పట్టభద్రులైన ఓటర్ల నమోదు ప్రక్రియ ఆరంభమైంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విల్లూరుతున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులైన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.


స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ(శనివారం) షెడ్యూల్‌ విడుదల అయింది ఈరోజు నుంచి విజయనగరం జిల్లాలో ఎన్నికల నియమావళి అమలు కానుంది. ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 28న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్‌ జరుగుతుంది. రఘురాజుపై అనర్హత వేటుతో విజయగనరం జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

Hyderabad: బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..

YSRCP: లైంగికంగా వేధించాడు.. మోసం చేశాడు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2024 | 11:18 AM