AP News: మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అధికారుల ప్రయత్నం ఫలించేనా?
ABN , Publish Date - Aug 13 , 2024 | 12:20 PM
Andhrapradesh: ఏలూరులో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మొక్కల నాటారు.
ఏలూరు, ఆగస్టు 13: చదువుకుని ఎంతో గొప్ప భవిష్యత్తును చూడాల్సిన నేటి యువతరం మత్తుపదార్థాలకు బానిసలుగా మారిపోతున్నారు. యువతే టార్గెట్‌గా కొందరు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ పబ్బం గడుపుతున్న పరిస్థితి. మత్తుపదార్థాలకు అలవాడు పడిన యువత తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. కన్నవారికి తీవ్ర ఆవేదనను మిగులుస్తున్న పరిస్థితి. మరోవైపు దేశంలో ఏ ప్రాంతంలో డ్రగ్స్ పట్టుబడినా దానికి మూలాలు ఏపీలో కనిపిస్తున్న పరిస్థితి. డ్రగ్స్ విక్రయదారులు లేదా కొనుగోలుదారులు రాష్ట్రానికి చెందిన వారు ఉండటం తీవ్ర కలవరాన్ని రేపుతోంది. ఈ క్రమంలో అధికారులు మాదకద్రవ్యాల నిర్మూలనపై పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
Telangana: హరీష్ రావు కామెంట్స్.. కంటతడి పెట్టుకున్న మంత్రి తుమ్మల..
అందులో భాగంగాలో ఏలూరులో (Eluru) మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మొక్కల నాటారు.
CM Chandrababu: కూటమి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఏం చెప్పారంటే..?
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులను మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు. మాదకద్రవ్యాలు విక్రయాలపై ప్రజలకు ఎటువంటి సమాచారం ఉన్నా అధికారులకు తెలియజేయాలన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు డిఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాలు బానిసైన వారికి డి అడిక్షన్ సెంటర్‌లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని కలెక్టర్ వెట్రి సెల్వి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
AP News: శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం
Read Latest AP News And Telugu News