Amalapuram: వైసీపీ కీలక నేత వాసంశెట్టి రాజీనామా.. కారణం అదే..
ABN , Publish Date - Jan 18 , 2024 | 08:41 AM
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీకి వరస షాక్ లు తగులుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీకి వరస షాక్ లు తగులుతున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ కీలక నేత వాసంశెట్టి సుభాశ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఒక కౌన్సిలర్, పలువురు ఎంపీటీసీలు రాజీనామా ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలో పట్టున్న కీలక నేత సుభాశ్ వైసీపీకి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కార్యకర్తల కోరిక మేరకు ఏ పార్టీలో చేరాలనేది త్వరలోనే చెప్తానని ఆయన చెప్పారు. స్థానిక నేతలతో విభేదాల నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేసినట్లు సుభాశ్ వెల్లడించారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా సొంత డబ్బు ఖర్చు చేసి మరీ వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని వాసంశెట్టి తెలిపారు. స్థానిక నాయకత్వం కారణంగా ఏడాదిన్నర కాలంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యామన్నారు. తమతో పాటు ఎందరినో అల్లర్ల కేసులో అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బంది పెట్టే నాయకులకు టిక్కెట్లు ఇవ్వకూడదని చెప్పినా..వారికే టిక్కెట్ ఇస్తారని ప్రకటనలు వస్తున్నాయని.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.