Kesineni Chinni: టీడీపీ మేనిఫెస్టో అలా ఉండదంటూ కేశినేని చిన్ని వ్యాఖ్యలు..
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:39 PM
టీడీపీ మేనిఫెస్టోపై నేడు ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్ధి స్పందించారు. ఇవాళ తూర్పు నియోజకవర్గం రాణిగారితోటలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని (శివనాథ్) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా... వారి ఆటలు సాగవని.. ప్రజలు అప్రమత్తతతో ఉన్నారని తెలిపారు. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉందని కేశినేని చిన్ని అన్నారు.
విజయవాడ: టీడీపీ మేనిఫెస్టోపై నేడు ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్ధి స్పందించారు. ఇవాళ తూర్పు నియోజకవర్గం రాణిగారితోటలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని (Kesineni Chinni) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా... వారి ఆటలు సాగవని.. ప్రజలు అప్రమత్తతతో ఉన్నారని తెలిపారు. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉందని కేశినేని చిన్ని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలందరూ చంద్రబాబు రావాలని.. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారన్నారు. సంక్షేమం కావాలని.. అమరావతి కావాలని కోరుకుంటున్నారని కేశినేని చిన్ని తెలిపారు. 5 కోట్ల మంది ప్రజలు వారి భవిష్యత్ బాగు కోసం ఎన్డీయే కూటమి గెలుపు కోరుకుంటున్నారన్నారు. వైసీపీ మేనిఫెస్టోకి.. టీడీపీ మేనిఫెస్టోకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ సంక్షేమం అందిస్తామని కేశినేని చిన్ని తెలిపారు.
Loksabha Polls: నువ్వు పొత్తు పెట్టుకున్న కూటమి ఏది?.. కేసీఆర్‌కు పొంగులేటి సూటి ప్రశ్న
ఇక గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అందరినీ మోసం చేశారన్నారు. క్షేత్రస్థాయిలో అనేక మంది పనులు లేక, ఉపాధి లేక కన్నీరు పెడుతున్నారన్నారు. కృష్ణానది రిటైనింగ్ వాల్ చంద్రబాబే తొలుత కట్టారని గద్దె రామ్మోహన్ తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో.. మిగిలిన పనిని మాత్రమే వాళ్లు పూర్తి చేశారన్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు. ఏపీలో కూటమి విజయం ఖాయమని.. తాను వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని గద్దె రామ్మోహన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..
160 సీట్లు మావే.. ఏపీ ఎన్నికలపై ఆంధ్రజ్యోతికి నారా లోకేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
Read Latest Telangana News And Telugu News