Pemmasani Chandrasekhar: ఏపీలో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన పెమ్మసాని..
ABN , Publish Date - Apr 30 , 2024 | 10:12 AM
ఏపీలో అభ్యర్థులంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నేడు ఆయన.. పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పెదకాకాని మండలం రెయిన్ ట్రీ అపార్ట్‌మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
గుంటూరు: ఏపీలో అభ్యర్థులంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) తెలిపారు. నేడు ఆయన.. పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పెదకాకాని మండలం రెయిన్ ట్రీ అపార్ట్‌మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. జనసేన పోటీలో లేని చోట గాజు గ్లాసు గుర్తులు కేటాయించడం దారుణమన్నారు.
YSRCP: రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలు..
ఈ విషయంపై ముందుగానే ఎన్నికల అధికారులను కలిసి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. అయినా కానీ అధికారులు స్వతంత్ర అభ్యర్థులకు, కొందరు రెడ్డి సోదరులకు గాజు గ్లాసు కేటాయించారని పెమ్మసాని తెలిపారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులకు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం కూటమి విజయం ఖాయమన్నారు. 125 నుంచి 150 అసెంబ్లీ, 17 నుంచి 23 ఎంపీ సీట్లు ఎన్డీయే కూటమికి వస్తాయన్నారు. అమరావతి నుంచి రాజధాని తరలించటం సీఎం జగన్ వల్ల కాదని పెమ్మసాని అన్నారు.
ఇవి కూడా చదవండి...
160 సీట్లు మావే.. ఏపీ ఎన్నికలపై ఆంధ్రజ్యోతికి నారా లోకేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
AP News: గుడివాడ గడ్డ - బెట్టింగ్ అడ్డా..
Read Latest AP News And Telugu News