AP Elections: బెజవాడలో సీఎం జగన్ ఫ్లాప్ షో.. కేశినేని చిన్ని విమర్శలు
ABN , Publish Date - Apr 17 , 2024 | 08:33 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విజయవాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెజవాడలో సీఎం జగన్ పర్యటన ప్లాప్ అయ్యిందని వివరించారు. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (YS Jagan) విజయవాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెజవాడలో సీఎం జగన్ పర్యటన ప్లాప్ అయ్యిందని వివరించారు. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనలో రాళ్ల దాడి జరిగిందని గుర్తుచేశారు. అయినప్పటికి ఆ అంశాన్ని తమ పార్టీ రాజకీయం చేయదలుచుకోలేదని వివరించారు.
AP Election 2024: వైసీపీపై మూకుమ్మడి దాడి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
ఎన్నికలు రాగానే వైసీపీ ఏదో ఒక డ్రామా మొదలు పెడుతుందని కేశినేని చిన్ని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో కోడి కత్తి డ్రామా ఆడారని గుర్తు చేశారు. దళితుడిని కేసులో ఇరికించారని, బెయిల్ మీద బయటకు వస్తే నిజాలు బయటకొస్తాయని రాకుండా చేశారని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు గులక రాయి డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. డ్రామాలో చీఫ్ సెక్రటరీ, విజయవాడ పోలీస్ కమిషనర్ డ్రామాను రక్తి కట్టించారని వివరించారు.
గులకరాయి కేసు ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టాలని విజయవాడ పోలీస్ కమిషనర్ చూస్తున్నారని కేశినేని చిన్ని ఆరోపించారు. విజయవాడకు చెందిన కొందరు కుర్రాళ్లను హింసించాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిజ నిజాల తేల్చాలని, కానీ అమాయకులను కేసులో ఇరికించొద్దని సూచించారు.
AP Election: ఆంధ్రా ఓటరు ఎటు వైపు..?
మరిన్ని ఏపీ వార్తల కోసం