Share News

Loksabha Polls: పెద్దపల్లిలో కీ ఓటర్స్ వీరే..?

ABN , Publish Date - May 09 , 2024 | 05:01 PM

పెద్దపల్లి లోక్ సభ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2004 నుంచి ఎంపీ అభ్యర్థి మారుతున్నారు. మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వడం లేదు. పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ బరిలోకి దిగారు. ఈయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు.

Loksabha Polls: పెద్దపల్లిలో కీ ఓటర్స్ వీరే..?
peddapally

పెద్దపల్లి లోక్ సభ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2004 నుంచి ఎంపీ (MP) అభ్యర్థి మారుతున్నారు. మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వడం లేదు. పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ (Vamsi Krishna) బరిలోకి దిగారు. ఈయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ (Srinivas) వరసగా రెండోసారి పోటీకి దిగారు.


పెద్దపల్లి (Peddapally) ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 నియోజకవర్గాల్లో సింగరేణి కుటుంబాలు ఉంటాయి. సింగరేణి కుటుంబాల మద్దతు ఉన్న అభ్యర్థి గెలుపొందడం ఖాయం. సింగరేణి కుటుంబాల మద్దతుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టిసారించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దాంతో సింగరేణి కుటుంబాల మద్దతు పొందడంలో కాంగ్రెస్ పార్టీ ముందు వరసలో ఉంది.


ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) అనుబంధ ఐఎన్ టీయూసీ సత్తా చాటింది. సింగరేణి గుర్తిపు సంఘం ఏఐటీయూసీ కూడా వంశీకి మద్దతు ప్రకటించింది. దీంతో గడ్డం వంశీ కృష్ణ విజయం నల్లేరు మీద నడకలా అవనుంది.


కొప్పుల ఈశ్వర్‌ను (Koppula Eshwar) తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఈశ్వర్ సింగరేణి కార్మికుడు అనే సంగతి తెలిసిందే. కార్మికుడి నుంచి నేతగా ఎదిగారు. ఇప్పటికీ కార్మిక నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఉద్యమాల్లో చురుగ్గా పనిచేయడంతో ఆయన వైపు కొందరు నిలిచే అవకాశం ఉంది. కార్మిక కుటుంబాలను ప్రసన్నం చేసుకునే పనిలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఉన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!

AP Election 2024: జిల్లాల వారీగా సర్వే వివరాలు ప్రకటించిన గోనె ప్రకాశరావు

Read latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2024 | 05:12 PM