CM Revanth: మోదీ - కేసీఆర్ తోడు దొంగలు.. సీఎం రేవంత్‌రెడ్డి విసుర్లు
ABN , Publish Date - Apr 22 , 2024 | 03:03 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోడు దొంగలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆదిలాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోడు దొంగలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పేద ప్రజల కోసం పని చేస్తున్న కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశామని స్పష్టం చేశారు. త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
Raghunandan rao: నా గొంతుని కాపాడండి.. మోసపోయి మీరు ఆగం కావొద్దు
బోథ్ ప్రాంతంలో కుఫ్టీ ప్రాజెక్టు నిర్మిస్తామని మాటిచ్చారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజి నిర్మిస్తామన్నారు. ఆదిలాబాద్‌లో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నామని, ప్రాణహిత బ్యారేజి నిర్మాణం పూర్తి చేసి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రకటించారు. జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూతపడ్డ సీసీఐ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరిస్తామ న్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కలిపిస్తామని అన్నారు.
మోదీ, కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యాన్ని ఎందుకు కూలగొట్టాలని చూస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనను జీర్ణించుకోలేక ఢిల్లీలో ఉండే మోదీ - గల్లీలో ఉన్న కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం ప్రమాదంలో పడితే అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిచి పోతాయని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీజేపీ - బీఆర్ఎస్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు.
CM Revanth Reddy: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100రోజుల్లోనే అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. హామీలు అమలు చేస్తున్న కాంగ్రెస్‌ను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఓర్వడం లేదని నిలదీశారు. ఆ రెండు పార్టీల్లో ఏ అభ్యర్థికి ఓటు వేసిన వారంతా ఒక్కటేనని ఆరోపించారు. వారు గెలిచిన ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిధులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లిన మోదీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Delhi liquor Case: కవిత బెయిల్‌కు అర్హురాలన్న లాయర్లు.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ
Read Latest Election News or Telugu News