Rahul Gandhi: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి..? మోదీ ఏజెంట్ అని సందేహాం..!!
ABN , Publish Date - Apr 23 , 2024 | 09:24 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌కు గాంధీ కుటుంబంతో సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తన ఒక్కడి సందేహాం కాదని యావత్ దేశ ప్రజలు ఇదే మాట అనుకుంటున్నారని వివరించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌కు గాంధీ కుటుంబంతో సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తన ఒక్కడి సందేహాం కాదని యావత్ దేశ ప్రజలు ఇదే మాట అనుకుంటున్నారని వివరించారు. రాహుల్ అధమ స్థాయి పౌరుడు అని, అతనికి డీఎన్ఏ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. మంగళవారం పాలక్కాడ్‌లో జరిగిన ర్యాలీలో అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నిలంబర్ నియోజకవర్గం నుంచి అన్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండిపెండెంట్ అయినప్పటికీ అధికార ఎల్డీఎఫ్ కూటమికి మద్దతుగా ఉన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తోన్న వాయనాడు లోక్ సభ నియోజకవర్గంలో నిలంబర్ కూడా ఉంది. ‘రాహుల్‌ను ఇంటి పేరుతో పిలువలేను. అతను స్థాయి అది కాదు. గాంధీ పేరుతో పిలిచే అర్హత అతనికి లేదు. నేనే కాదు.. దేశ ప్రజలు కూడా రెండు, మూడు రోజుల నుంచి ఇదే విషయం మాట్లాడుతున్నారు అని’ అన్వర్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్‌పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దాంతో అనర్వ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘నెహ్రూ కుటుంబంలో రాహుల్ లాంటి సభ్యులు ఉంటారా? ఇదే అంశంపై నెహ్రూ కుటుంబంలో పుట్టిన వారు చెప్పగలరా? రాహుల్ అంశంపై నాకు సందేహాలు ఉన్నాయి. రాహుల్‌గాంధీ డీఎన్‌ఏ పరీక్షించాలి. జవహర్‌లాల్ నెహ్రూ మనవడిగా రాహుల్ కొనసాగే హక్కు లేదు. రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి ఏజెంట్ అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది అని’ అన్వర్ మండిపడ్డారు. అన్వర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అన్వర్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కేరళ కాంగ్రెస్ పార్టీ కోరింది.
Read Latest Election News or Telugu News