Lok Sabha Election 2024: అందుకే కేటీఆర్ పేరు ఎప్పుడూ ప్రస్తావించను: కిషన్ రెడ్డి
ABN , Publish Date - May 08 , 2024 | 06:31 PM
పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. నిన్న(మంగళవారం) ఓ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని.. కురే కురే బీజేపీ అని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. నిన్న(మంగళవారం) ఓ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని.. కురే కురే బీజేపీ అని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు.
‘‘కేటీఆర్ చిల్లర గాడు! అన్ని చిల్లర మాటలు మాట్లాడుతాడు. నీ పేరు కూడా ఉచ్చరించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడూ నీ పేరును ప్రస్తావించను. నీ కామెంట్లపై నేను స్పందించను’’ అని కిషన్ రెడ్డి వాస్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారని అన్నారు. రిజర్వేషన్ లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని చెప్పారు.
Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది
కాంగ్రెస్ ‘రిజర్వేషన్’ ప్రచారం ఫెయిల్ అయిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది బాధ్యతారాహిత్యమైన విమర్శ అని కొట్టిపారేశారు. వెనుకబడిన వర్గాలనుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చారని.. రిజర్వేషన్లు తొలగించరనే విశ్వాసం ప్రజల్లో ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పారు. దేశం, రాష్ట్రంలో అత్యధిక స్థానాలు తమ పార్టీనే గెలువబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ పట్ల విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారం తమకు సానుకూలంగా మారుతోందన్నారు. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చారని .. కానీ రాష్ట్రం అభివృద్ధి కోసం వారు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
అంతకుముందు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉందని అన్నారు. ఈసారి మెజార్టీ ఓట్లు బీజేపీకే వేయాలని ప్రజలు నిశ్చయించుకున్నారని అన్నారు. ఇది చూసి కాంగ్రెస్ పార్టీలో కలవరం పెరిగిందన్నారు. బీజేపీకి వస్తున్న ఆదరణతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో అసహనం కనబడుతోందన్నారు. బీజేపీ ప్రచారానికి ఊరూరా అద్బుతమైన స్పందన వస్తోందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. ఈ ఎన్నికల్లో బీజేపీకే తమ ఓటు వేస్తామని చెబుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Komatireddy Venkatreddy: వచ్చే పదేళ్లు రేవంతే సీఎం.. జూన్ 5కి వారంతా కాంగ్రెస్‌లోకి..
Read Latest Telangana News And Telugu News