Share News

AP Elections: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే..?

ABN , Publish Date - May 08 , 2024 | 01:34 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు.

AP Elections: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే..?
Minister Komatireddy Venkat Reddy

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ రెండు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ లభించలేదు. ఈ సారి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, కడప లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. పార్టీ కోసం అవిశ్రాంతంగా షర్మిల శ్రమిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఏమన్నారంటే..?

సోమాజిగూడ మీట్ ద ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం నాడు మాట్లాడారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు. ఏపీలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ గురించి నెగిటివ్‌గా మాట్లాడారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో ఏపీ కాంగ్రెస్ శ్రేణులు ఖంగుతిన్నారు.


కాస్త మెరుగే..?

ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. షర్మిల బహిరంగ సభ, లేదంటే రోడ్ షో చేపడితే జనం నుంచి స్పందన లభిస్తోంది. కడప లోక్ సభ నుంచి బరిలోకి దిగిన షర్మిల.. తన విజయం ఖాయం అనే ధీమాతో ఉంది. 1, 2 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని అక్కడి స్థానిక నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఇంతలో తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేసింది.


వైఎస్ కుటుంబానికి క్లోజ్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణించిన తర్వాత జగన్, షర్మిలతో మంచి రిలేషన్ షిప్ ఉంది. సమయం దొరికినప్పడు వారిని కలుస్తూ ఉంటారు. ఇద్దరితో మంచి ఫ్రెండ్ షిఫ్ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మంత్రి కామెంట్లపై హై కమాండ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.



Read Latest
Telangana News And Telugu News

Updated Date - May 08 , 2024 | 01:34 PM