Pawan Kalyan: పవన్‌కు తరుచూ అనారోగ్యం.. డాక్టర్లు కీలక ప్రకటన
ABN , Publish Date - Apr 20 , 2024 | 07:31 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. తరచూ జ్వరం బారిన పడుతున్నారు. ఏం జరిగిందని వైద్య పరీక్షలు జరిపించారు. పవన్ కల్యాణ్‌కు రికరెంట్ ఇన్సుయం వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిందని జనసేన పార్టీ శనివారం నాడు ప్రకటనలో పేర్కొంది.
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అనారోగ్యానికి గురయ్యారు. తరచూ జ్వరం బారిన పడుతున్నారు. ఏం జరిగిందా..? అని వైద్య పరీక్షలు చేయించగా.. పవన్ కల్యాణ్‌కు రికరెంట్ ఇన్‌ఫ్లూయంజా వల్ల ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందని తేలింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ శనివారం నాడు అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఊపిరితిత్తుల్లో నెమ్ము ఉండటం వల్ల తరచూగా జ్వరం బారిన పడ్డారని డాక్టర్లు చెప్పినట్లు ప్రకటనలో తెలిపింది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారని, అభిమానులు, జనసేన కార్యకర్తలు గమనించాలని ప్రకటనలో పార్టీ కోరింది.
AP Elections: నోరుజారిన మంత్రి కారుమూరి.. ఏమన్నారంటే..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. శనివారం నుంచి (నేడు) విజయభేరీ యాత్రలో పాల్గొంటున్నారు. ఆయా చోట్ల పవన్ కల్యాణ్ వద్దకు గజమాలలు ఏర్పాటు చేయొద్దని అభిమానులను పార్టీ కోరింది. ఫొటోల కోసం స్టేజీ మీదకు రావొద్దని, కరచాలనం చేసేందుకు రావొద్దని సూచించింది. పూలు కూడా చల్లొద్దని పేర్కొంది. పూలు మొహం మీద పడితే శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ సూచనలను అభిమానులు గమనించాలని మరీ మరి కోరింది.
Atchannaidu: గులకరాయి డ్రామాకు దర్శకత్వం వహించినవారికి తగిన రీతిలో సన్మానం... అచ్చెన్న వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కూటమిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తర్వాత చరిష్మా ఉన్న నేత పవన్ కల్యాణే. ఆయన వస్తున్నారంటే జనం కూడా తండోప తండాలుగా వస్తుంటారు. అలా కూటమికి మంచి జోష్ తీసుకొస్తుంది. ఇంతలో పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురికావడం శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది.
AP Election 2024: గన్నవరంలో హీటెక్కిన రాజకీయం.. చర్చకు దారి తీసిన నామినేషన్
మరిన్ని ఏపీ వార్తల కోసం