AP Elections: నోరుజారిన మంత్రి కారుమూరి.. ఏమన్నారంటే..?
ABN , Publish Date - Apr 20 , 2024 | 06:01 PM
ఆంధ్రప్రదేశ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నోటి దూల కాస్త ఎక్కువ. రైతులంటే చులకన భావంతో ఉంటారు. ఇదివరకు ఓ రైతును ఎర్రి పప్ప అన్నారు. సర్వత్రా విమర్శలు రావడంతో దిగొచ్చారు. తాజాగా మరో రైతుపై నోరు పారేసుకున్నారు.
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు (Karumuri Nageswara Rao) నోటి దూల కాస్త ఎక్కువ. రైతులంటే చులకన భావంతో ఉంటారు. ఇదివరకు ఓ రైతును ఎర్రి పప్ప అన్నారు. సర్వత్రా విమర్శలు రావడంతో దిగొచ్చారు. తాజాగా మరో రైతుపై నోరు పారేసుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. మంత్రి తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి
ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారంలో నేతలు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు శనివారం నాడు ఇరగవరం మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. పొలంలోకి వెళ్లారు. పంటకు సంబంధించిన సమస్యలను రైతులు చెబుతున్నారు. ఓ రైతు మాట్లాడుతుండగా మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఓహో.. నీ యమ్మ నేను కష్టపడినోడినే అన్నారు. దాంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. మంత్రి కారుమూరి ఏంటీ ఇలా అన్నారెంటీ అని ముక్కున వేలేసుకున్నారు.
AP Election 2024: గన్నవరంలో హీటెక్కిన రాజకీయం.. చర్చకు దారి తీసిన నామినేషన్
గతంలో ఇలా..?
గత ఏడాది కూడా మంత్రి కారుమూరి నోరు జారారు. తణుకు మండలం వేల్పూరులో మంత్రి పర్యటించారు. అకాల వర్షాలతో రైతుల పంట తడవడంతో మంత్రి దృష్టికి ఓ రైతు సమస్యను తీసుకెళ్లాడు. ‘ఎర్రిపప్పా.. మొలకలొస్తే నేనేం చేస్తా’ అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. తాను అన్నది మరో ఉద్దేశంతో అని కవర్ చేశారు. ఇప్పుడు మరో రైతును నీ యమ్మ అని తులనాడారు.
Atchannaidu: గులకరాయి డ్రామాకు దర్శకత్వం వహించినవారికి తగిన రీతిలో సన్మానం... అచ్చెన్న వార్నింగ్
మరిన్ని ఏపీ వార్తల కోసం