Share News

Curry leaves: కరివేపాకే కదా అని తీసి పడేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..

ABN , Publish Date - Aug 07 , 2024 | 07:30 AM

భారతీయ వంటల్లో ముఖ్యంగా తెలుగు నాట వంటలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే మనం వాడే రకరకాల పదార్థాల వల్ల ఆహారానికి మంచి రుచి వస్తుంది. అయితే కూరల్లో వేసే కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది వేయకుండా వంట చేయరంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ చెట్టు దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది.

Curry leaves: కరివేపాకే కదా అని తీసి పడేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..
Health Benefits Of Curry Leaves,

భారతీయ వంటల్లో ముఖ్యంగా తెలుగు నాట వంటలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే మనం వాడే రకరకాల పదార్థాల వల్ల ఆహారానికి మంచి రుచి వస్తుంది. అయితే కూరల్లో వేసే కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది వేయకుండా వంట చేయరంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ చెట్టు దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. చాలా మంది భోజనం చేసేటప్పుడు కరివేపాకు పక్కన పెట్టేస్తుంటారు. దీన్ని వల్ల ఒక సామేత కూడా పుట్టుకొచ్చింది. అదేనండి.."కరివేపాకు తీసి పడేసినట్లు చులకనగా మాట్లాడుతున్నావ్" అనే సామెత. దాని గొప్ప గుణాలు తెలిస్తే మీరు ఇక ఆ పని చేయరు. దీన్ని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..


డయాబెటిస్, ఊబకాయం నియంత్రిస్తుంది..

కరివేపాకు తరచూ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం ముప్పు నుంచి బయటపడొచ్చు. ఇది శరీరంలోని చెడు కొవ్వును నియంత్రించి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. డయాబెటిస్‌ తగ్గిస్తుందని వైద్యులు చెప్తున్నారు. అలాగే గ్యాస్ట్రో వంటి తీవ్రమైన సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. క్యాన్సర్, అతిసార వంటి వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది.


రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

కరివేపాకుని రోజూ తినడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో అనేక రోగాలు మన దరి చేరే అవకాశం ఉండదు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని క్లీన్ చేస్తాయి. ఎముకల అరుగుదలను కూడా ఇది నివారిస్తుంది. అలాగే అందరికీ తెలిసినట్లుగా దీన్ని తినడం వల్ల కంటి చూపు సమస్యలు తొలగిపోతాయి.


జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు..

కరివేపాకు తినడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కరివేపాకును ప్యాక్‌గా తలకు పెట్టడం వల్ల జుట్టు ఒత్తుగా, ఊడిపోకుండా ఉంటుంది. జీర్ణసమస్యలకు కరివేపాకు దివ్య ఔషధం అనే చెప్పాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది. ఆహారం బాగా జీర్ణం అవడంతో పలు సమస్యలు దరి చేరవు. చర్మ సంరక్షణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.


కాలేయ సమస్యలు దూరం..

హెపటైటిస్ , సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కరివేపాకు రక్షిస్తుంది. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే గుణాలు దీంట్లో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కరివేపాకే కదా అని చులకనగా చూసి తీసి పారేయకండి. ఇంట్లో చెప్పి మరీ కూరల్లో వేయించుకుని మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.


కరివేపాకులో ఉండే పోషకాలు గురించి తెలుసుకుందాం..

కరివేపాలో యాంటీ ఆక్సిడెంట్లు సహా వివిధ రకాల ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ సి, హిపటో ప్రొటెక్టివ్స్, యాంటీ డయాబెటిక్ సమృద్ధిగా ఉంటాయి. నికోటిన్ ఆమ్లంతోపాటు విటమిన్లు ఏ, బి, ఈ ఉంటాయి. అలాగే ప్లాస్టిస్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్ తినడం మాత్రం మర్చిపోకండి.

Updated Date - Aug 07 , 2024 | 07:47 AM