Y Chromosomes: మగజాతి అంతరించిపోతుందా... షాకింగ్‌కు గురిచేస్తున్న నివేదిక..
ABN , Publish Date - Sep 03 , 2024 | 09:57 AM
మగజాతి సంతతి తగ్గిపోతుందని, భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్న ఓ నివేదిక షాకింగ్‌కు గురిచేస్తోంది. మగవారి పుట్టుకకు కారణమైన వై క్రోమోజోములు అదృశ్యం అవుతున్నట్లు సైన్స్ అలర్ట్‌లోని ఒక నివేదిక తేల్చి చెప్పింది. దీంతో మగజాతి మనుగడ ప్రమాదం అంచుకు చేరుతోందని అర్థమవుతోంది. తాజాగా చేసిన అధ్యయనం ఆందోళనకు గురి చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మగజాతి సంతతి తగ్గిపోతుందని, భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్న ఓ నివేదిక షాకింగ్‌కు గురిచేస్తోంది. మగవారి పుట్టుకకు కారణమైన వై క్రోమోజోములు అదృశ్యం అవుతున్నట్లు సైన్స్ అలర్ట్‌లోని ఒక నివేదిక తేల్చి చెప్పింది. దీంతో మగజాతి మనుగడ ప్రమాదం అంచుకు చేరుతోందని అర్థమవుతోంది. తాజాగా చేసిన అధ్యయనం ఆందోళనకు గురి చేస్తోంది.
ఆడ, మగ పుట్టుకకు తేడా ఇదే..
ఆడపిల్లలు పుడతారా, మగ పిల్లలు పుడతారా అనేది పూర్తిగా మగవారిపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆడవారిలో ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. మగవారిలో ఎక్స్, వై క్రోమోజోములు ఉంటాయి. అయితే ఆడవారు గర్భం దాల్చే సమయంలో వారి ఎక్స్ క్రోమోజోములు మగవారి వై క్రోమోజోములు కలిస్తే మగ పిల్లలు పుడతారు. అలా కాకుండా ఇద్దరికీ చెందిన ఎక్స్, ఎక్స్ క్రోమోజోములు కలిస్తే ఆడపిల్లలు పుడతారు. అయితే తాజాగా సైన్స్ అలర్ట్ విడుదల చేసిన నివేదికలో మగవారిలో వై క్రోమోజోములు క్రమంగా కనుమరుగు అవుతున్నట్లు తేలింది.
ప్రమాదం అంచున్న మానవజాతి..
వై క్రోమోజోములు తగ్గిపోయినా లేకపోతే పూర్తిగా అదృశ్యమైనా మానవజాతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వై క్రోమోజోములు లేకపోతే మగవారు పుట్టరు. ప్రపంచం మెుత్తం పూర్తిగా ఆడవారే పుడతారు. దీంతో సృష్టి ఆగిపోతుంది. మగజాతి లేకపోతే పునరుత్పత్తికి అవకాశమే ఉండదు. కాబట్టి ఇక మానవజాతి అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రక్రియ జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని, అయితే ఈ లోపే కొత్త అధ్యయనాలు అవసరం అని సైన్స్ అలర్ట్ నివేదిక చెప్తోంది.
అధ్యయనం అవసరం..
అయితే వై క్రోమోజోములకు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మానవులలో వైక్రోమోజోమ్ తగ్గిపోయినా, లేదా పూర్తిగా కనుమరుగు అయినా మానవజాతి మిగలదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధ్యయనం చేపట్టి వై క్రోమోజోములకు ప్రత్యా్మ్నాయంపై ఇప్పట్నుంచే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్తున్నారు.
కొత్త జన్యువులు అవసరం..
వై క్రోమోజోమ్ తగ్గడంపై పలువురు శాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురించిన ఓ పరిశోధనా పత్రం కొత్త జన్యువుల అభివృద్ధి ఎంత అవసరమో చెప్పింది. దీనిపై త్వరగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వాటిని అభివృద్ధి చేయకపోతే ఎంతో ప్రమాదమని హెచ్చరించింది. అయితే ఆ పరిశోధనా పత్రం కొత్త క్రోమోజోముల అభివృద్ధి చేయవచ్చని చెబుతూనే అందులో ఉండే సమస్యలు, ప్రమాదాల గురించి వివరించింది.
వై క్రోమోజోములు తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త అధ్యయనాలు చేపట్టి ప్రత్యామ్నాయ మార్గం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భూగ్రహం మీద ఇకపై మానవజాతి మిగిలే అవకాశం లేకుండా పోతుంది.