Share News

Jeans use: అమ్మాయిలూ.. జీన్స్ ధరిస్తున్నారా.. జాగ్రత్త..

ABN , Publish Date - Sep 04 , 2024 | 07:46 AM

తరచూ బిగుతుగా ఉండే జీన్స్‌ ధరించడం వల్ల మగ, ఆడవారిలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీన్స్ ధరించడం వల్ల సాధారణంగా చర్మ సమస్యలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. టైట్‌గా ఉండే జీన్స్ చర్మాన్ని గట్టిగా పట్టేస్తుంది. దీని వల్ల చెమట బయటకు వెళ్లే అవకాశం ఉండదు. దీంతో చర్మంపై చికాకు రావడం, జననేంద్రియాల వద్ద గజ్జి, దురద, వంటి అనేక రకాల సమస్యలు తలెత్తె ప్రమాదం పొంచి ఉంది. అయితే ఆడవారిలో మాత్రం మరికొన్ని ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Jeans use: అమ్మాయిలూ.. జీన్స్ ధరిస్తున్నారా.. జాగ్రత్త..

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో ఒకప్పుడు స్త్రీలు కేవలం చీరలు మాత్రమే ధరించేవారు. అయితే బ్రిటిష్ పాలన, ఆధునిక సమాజంలో మార్పులు కారణంగా ఫ్యాషన్ రంగం వృద్ధి చెందింది. పాశ్చాత్యులు వాడే జీన్స్ సంస్కృతి పలు దేశాలకు పాకింది. దీనిలో భాగంగానే మన దేశంలో యువతీ, యువకులు జీన్స్ ప్యాంట్లు ధరించడం మెుదలుపెట్టారు. ముందు అబ్బాయిలు వీటిని ధరించగా, మెల్లిగా నగరాలు, పట్టణ ప్రాంతాల అమ్మాయిలు సైతం మేమేమీ తక్కువ కాదంటూ మెుదలుపెట్టారు. అయితే మహిళలు జీన్స్ ప్యాంట్లు ఎక్కువగా వాడడం ద్వారా అనేక ఆరోగ్య సమస్య వస్తాయని నిపుణులు చెప్తున్నారు. అవి ఏంటో ఏ విధంగా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

తరచూ బిగుతుగా ఉండే జీన్స్‌ ధరించడం వల్ల మగ, ఆడవారిలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీన్స్ ధరించడం వల్ల సాధారణంగా చర్మ సమస్యలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. టైట్‌గా ఉండే జీన్స్ చర్మాన్ని గట్టిగా పట్టేస్తుంది. దీని వల్ల చెమట బయటకు వెళ్లే అవకాశం ఉండదు. దీంతో చర్మంపై చికాకు రావడం, జననేంద్రియాల వద్ద గజ్జి, దురద, వంటి అనేక రకాల సమస్యలు తలెత్తె ప్రమాదం పొంచి ఉంది. అయితే ఆడవారిలో మాత్రం మరికొన్ని ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అనేక ఆరోగ్య సమస్యలు..

ఫ్యాషన్ కోసం చాలా మంది అమ్మాయిలు బాగా టైట్‌గా ఉంటే జీన్స్ వేసుకుంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరం. బిగుతుగా ఉండే జీన్స్ వల్ల రక్త ప్రసరణ సమస్యలు వస్తాయి. జీన్స్ చర్మాన్ని గట్టిగా పట్టేయడంతో చర్మం, నరాలపై ఒత్తిడి పడి రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో శరీర భాగాలకు తగినంత రక్తం సరఫరా కాక ఆ ప్రాంతంలో నొప్పులు, వాపులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే నడుము వద్ద టైట్‌గా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టైట్ జీన్స్ నరాల సమస్యలకు కారణమవుతాయి. ఎందుకంటే నరాలను జీన్స్ ఎక్కువగా సేపు నొక్కి ఉంచడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సంతానలేమి సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. టైట్ జీన్స్ ధరిస్తే జననేంద్రియాల వద్ద ఉష్ణోగ్రతలు పెరిగి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

జీన్స్ ధరించడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే బిగుతుగా ఉండే జీన్స్ కన్నా వదులుగా ఉండే వాటిని ధరించండి. అందులోనూ కాటన్ జీన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే కాటన్ అనేది మన శరీరం నుంచి వచ్చే చమటను బయటకు పంపేందుకు అవకాశం ఇస్తుంది. తద్వారా చర్మ సమస్యలు రావు. అలాగే ఎక్కువ సేపు జీన్స్ ధరించకండి. పనిపై బయటకు వెళ్లి వస్తే వెంటనే వాటిని తీసేసి వదులుగా ఉండే బట్టలు వేసుకోండి. ఎప్పటికప్పుడు మీ జీన్స్ దుస్తులు శుభ్రం చేయండి. గర్భిణులు, యువతులు జీన్స్ వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Sep 04 , 2024 | 11:08 AM