Share News

Amit Shah: పోలింగ్ శాతం పెంచితే విజయం మనదే.. పార్టీ వర్గాలకు అమిత్‌షా పిలుపు

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:41 PM

పోలింగ్‌ శాతం పెంచితే విజయం సునాయాసమవుతుందని, ఆ దిశగా శక్తికేంద్రం కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు.

Amit Shah: పోలింగ్ శాతం పెంచితే విజయం మనదే.. పార్టీ వర్గాలకు అమిత్‌షా పిలుపు

- చెన్నపట్టణలో ఉత్సాహంగా రోడ్‌షో

బెంగళూరు: పోలింగ్‌ శాతం పెంచితే విజయం సునాయాసమవుతుందని, ఆ దిశగా శక్తికేంద్రం కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) పిలుపునిచ్చారు. ఒకరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా అమిత్‌షా బిజీగా గడిపారు. బుదవారం ఉదయం బీజేపీ, జేడీఎస్‌(BJP, JDS) ముఖ్యనేతల అల్పాహార విందులో కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. బెంగళూరు గ్రామీణ, సెంట్రల్‌, దక్షిణ, ఉత్తర, చిక్కబళ్లాపుర నియోజకవర్గాల శక్తికేంద్రం ప్రముఖులతో సమావేశమయ్యారు. మైసూరు, దావణగెరె, చామరాజనగర నియోజకవర్గాల శక్తికేంద్రాల ప్రతినిధుల సభలో భాగస్వామ్యులయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) సందేశం, పదేళ్లలో ఆయన సాధనలు, కాంగ్రెస్‌ పాలనలో అవినీతి, కుంటుపడిన అభివృద్ధిపై ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసంతో ఉన్నారని, అందరిచేత ఓటు వేయిస్తే విజయం సులభమవుతుందన్నారు.


2014లో 43 శాతం ఓట్లతో 17స్థానాల్లో విజయం సాధ్యమైందని, 2019లో 51శాతంతో 25 స్థానాలు సాధించినట్టు తెలిపారు. నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎక్కడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదని వివరించారు. కాంగ్రెస్‌ పాలనలో కామన్వెల్త్‌, 2జీ, మంత్రుల క్వార్టర్స్‌, జమ్ము-కశ్మీర్‌, అగస్త హెలిక్యాప్టర్‌ వంటి అవినీతితో రూ.12 లక్షల కోట్ల కుంభకోణం చేశారన్నారు. దేశంలో చారిత్రాత్మకమైన ప్రగతి నరేంద్రమోదీ పదేళ్లపాలనతో సాగిందన్నారు. 12 కోట్ల శౌచాలయాలు, 10కోట్ల మందికి గ్యాస్‌, 4 కోట్ల ఇళ్లు నిర్మించారని తెలిపారు.


రూ.5లక్షల దాకా ఆరోగ్యబీమా సాధ్యమైందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేశామన్నారు. 500 ఏళ్లుగా గుడారంలో ఉన్న శ్రీరాముడికి భవ్యమైన రామమందిరం నిర్మించామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. యూపీఏ పదేళ్ల పాలనలో 1.40 లక్షల కోట్లు గ్రాంటు ఇవ్వగా, మోదీ పాలనలో 4.19 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. బీజేపీ నేత యడియూరప్ప(Yeddyurappa) మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని, అభివృద్ధి కుటంపడిందని ఇది పాలనావైఫల్యానికి నిదర్శనమన్నారు.


నరేంద్రమోదీని అభ్యర్థిగా భావించి గెలిపించాలన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రాధామోహన్‌దా్‌స అగర్వాల్‌, ఇన్‌చార్జ్‌ సుధాకర్‌రెడ్డి, మాజీ సీఎం సదానందగౌడ, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, గోవిందకారజోళ సహా ప లువురు పాల్గొన్నారు. అభ్యర్థులు సుధాకర్‌, శోభాకరంద్లాజె, డాక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌, పీసీ మోహన్‌, తేజస్వి సూర్యతో కలసి శంఖారావం పూరించారు. చెన్నపట్టణలో రోడ్‌షోకు భారీగా జనం చేశారు.


ఇవికూడా చదవండి:

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసు.. జైలు నుంచి ఆప్ ముఖ్య నేత విడుదల..

Updated Date - Apr 03 , 2024 | 01:08 PM