Share News

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:20 AM

మైసూరు నగరాభివృద్ధ్ది ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ నోటీసులు జారీ చేయడంపై మంత్రి వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

Bangalore : కర్ణాటక సీఎంకు గవర్నర్‌ నోటీసుపై మంత్రివర్గం అభ్యంతరం

  • వెనక్కి తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం

బెంగళూరు, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): మైసూరు నగరాభివృద్ధ్ది ప్రాధికార(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ నోటీసులు జారీ చేయడంపై మంత్రి వర్గం తీవ్ర అభ్యంతరం తెలిపింది. విధానసౌధలో గురువారం సీఎం సిద్దరామయ్య లేకుండా డీసీఎం డీకే శివకుమార్‌ అధ్యక్షతన క్యాబినెట్‌ భేటీ జరిగింది.

ముడా అవినీతికి సంబంధించి గవర్నర్‌ జారీ చేసిన నోటీసులు వాపసు తీసుకోవాలని క్యాబినెట్‌లో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ విషయాన్ని సహకార శాఖ మంత్రి రాజణ్ణ మీడియాకు తెలిపారు. సీఎం సిద్దరామయ్యకు రాజభవన్‌ నుంచి వచ్చి న షోకాజ్‌ నోటీసు గురించి చర్చించామని, న్యాయపోరాటం చేయాలని తీర్మానించామని చెప్పారు. గవర్నర్‌ జారీ చేసిన నోటీసును వాపసు తీసుకోవాలని క్యాబినెట్‌లో తీర్మానించామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రికి గవర్నర్‌ నోటీసు జారీ చేయడం రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. నోటీసులు తిరస్కరించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

Updated Date - Aug 02 , 2024 | 04:20 AM