Share News

Elections: హర్యానా ఫలితాల్లో బిగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Oct 08 , 2024 | 09:05 AM

మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. అధికారానికి 46 సీట్లు అవసరం. దాదాపు 50కి పైగ సీట్లలో కాంగ్రెస్ పూర్తి అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 25కు పైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఐఎన్‌ఎల్‌డి, బీఎస్పీ కూటమి పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ కూటమి అధిక్యంలో ఉండగా.. ఇతరులు మరో 5 స్థానాల్లో..

Elections: హర్యానా ఫలితాల్లో బిగ్ ట్విస్ట్..
Haryana Counting

హర్యానాలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా.. ఆ తరువాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఒకటే ట్రెండ్ కనిపిస్తూ వస్తోంది. సర్వే సంస్థల అంచనాలకు దగ్గరగానే ఫలితాల సరళి కనిపిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ అధికారానికి కావల్సిన మెజార్టీ సీట్లలో అధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. అధికారానికి 46 సీట్లు అవసరం. దాదాపు 50కి పైగ సీట్లలో కాంగ్రెస్ పూర్తి అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 25కు పైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఐఎన్‌ఎల్‌డి, బీఎస్పీ కూటమి పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ కూటమి అధిక్యంలో ఉండగా.. ఇతరులు మరో 5 స్థానాల్లో అధిక్యాన్ని కనబరుస్తున్నారు. హర్యానా ఫలితాల తమ మార్క్ చూపిస్తామని చెప్పిన ఆప్ ఖాతా తెరవలేని పరిస్థితి నెలకొంది. మొదట కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించినా.. సీట్ల సర్ధుబాటు కుదరకపోవడంతో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ఆ రాష్ట్రానికి సమీపంలో ఉండే హర్యానాలో బోణి కొడుతుందని ఆ పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేసినా హర్యానా ఓటర్లు మాత్రం ఆప్‌ వైపు మొగ్గుచూపనట్లు ఫలితాల సరళిని చూస్తే తెలుస్తోంది.


రెండు పార్టీల మధ్యనే..

హర్యానా ఫలితాల సరళి చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ జరిగినట్లు తెలుస్తోంది. పదేళ్లు వరుసగా అధికారంలో ఉండటంతో హర్యానా ఓటర్లు ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. బీజేపీ సంప్రదాయ ఓటర్లు మాత్రం ఆ పార్టీకే ఓట్లు వేయడంతో కనీసం 20 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని సర్వేసంస్థలు బీజేపీ 20కి పైగా స్థానాలు గెలుచుకుంటాయని అంచనా వేయగా.. మరికొన్ని కాంగ్రెస్ 60 నుంచి 70కు పైగా సీట్లను గెలుచుకుంటుందని, బీజేపీ 10 నుంచి 15లోపే గెలుస్తుందని తమ అంచనాలను ప్రకటించాయి. హర్యానా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ వైపు ఈసారి మొగ్గుచూపినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రైతుల ఉద్యమం, పదేళ్లు వరుసగా అధికారంలో ఉండటంతో వ్యతిరేకత, రెజ్లర్ల ఆందోళన బీజేపీకి నష్టం చేసినట్లు తెలుస్తోంది.


బోణి కొట్టని ఆప్..

ప్రస్తుతానికి ఫలితాల సరళి చూస్తుంటే ఆప్ పెద్దగా ప్రభావం చూపనట్లు అర్థమవుతోంది. కనీసం ఒక స్థానంలోనూ అధిక్యాన్ని కనబర్చడంలేదు. హర్యానాలో బోణి కొడితే.. తద్వారా దేశం మొత్తం విస్తరించాలనుకున్న కేజ్రీవాల్ ఆలోచనలకు హర్యానా ప్రజలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయేది చూడాలి మరి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 08 , 2024 | 09:05 AM