Elections: అందరి టార్గెట్ జమ్మూకశ్మీర్.. బీజేపీ ఆరో జాబితా విడుదల
ABN , Publish Date - Sep 08 , 2024 | 05:28 PM
జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు జమ్మూకశ్మీర్‌లో గెలుపుపై ఫోకస్ పెట్టాయి. 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు..
జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు జమ్మూకశ్మీర్‌లో గెలుపుపై ఫోకస్ పెట్టాయి. 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీతో పాటు పలుమ ప్రాంతీయ పార్టీలు జమ్మూకశ్మీర్‌లో గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు పెట్టుకుంది. గెలుపుపై కాంగ్రెస్, ఎన్సీ కూటమి భారీ ఆశలు పెట్టుకుంది. తొలిసారి జమ్మూకశ్మీర్‌లో అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. తాజాగా బీజేపీ 10 మంది అభ్యర్థులతో ఆరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోనూ జమ్మూకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తాకు టికెట్ కేటాయించలేదు. 2014 ఎన్నికల్లో ఆయన గాంధీ నగర్ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ
ఆరో జాబితా..
బీజేపీ తన ఆరో జాబితాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. కర్నా నుంచి మహ్మద్ ఇద్రీస్ కర్నాహి, హంద్వారా నుంచి గులామ్ మహ్మద్ మీర్, సోనావారి నుంచి అబ్దుల్ రషీద్ ఖాన్, బందిపోరా నుంచి నసీర్ అహ్మద్ లోన్, గురేజ్ నుంచి ఫకీర్ మహ్మద్ ఖాన్, ఉదంపూర్ ఈస్ట్ నుంచి ఆర్ ఎస్ పఠానియా, కతువా నుంచి డాక్టర్ భరత్ భూషణ్, బిష్నా నుంచి రాజీవ్ భగత్, బహు నుంచి విక్రమ్ రంధావా, మార్ నుంచి సురీందర్ భగత్‌కు బీజేపీ టికెట్లు కేటాయించింది.
Aadhaar New Rule: ఆధార్ కార్డు జారీ ఇక అంత ఈజీ కాదు
అక్టోబర్8న ఫలితాలు
జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు నియోజకవర్గాలు ఎస్సీలకు, 9 నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) 28 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) 15, కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ పోలింగ్ సెప్టెంబర్ 18న, రెండోదశ సెప్టెంబర్ 25, అక్టోబర్1న మూడో దశ పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్8న ఓట్ల లెక్కింపు చేపడతారు.
IMD: ఐఎండీ అలర్ట్.. రేపు రాజస్థాన్ సహా 28 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్
బీజేపీ హామీలు ఇవే..
జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మెట్రో కనెక్టివిటీ, అమ్యూజ్‌మెంట్ పార్కులను ఏర్పాటు చేసి ప్రతి వృద్ధ మహిళకు ప్రతి సంవత్సరం రూ.18వేలు ఇచ్చేలా ‘మా సమ్మాన్ యోజన’ను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఉజ్వల పథకం కింద ప్రతి సంవత్సరం రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని, ప్రగతి శిక్షా యోజన కింద కళాశాల విద్యార్థులకు ప్రయాణ భత్యం కింద ఏడాదికి రూ.3,000 ఇస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది.
National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్ భూషణ్ సింగ్‌కు నడ్డా సలహా..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News