Delhi : కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు
ABN , Publish Date - Jul 14 , 2024 | 04:18 AM
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ)కు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. వివిధ కేసులలో విచారణకు అనుమతి ఇవ్వడం, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారులు...
న్యూఢిల్లీ, శ్రీనగర్, జూలై 13: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ)కు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. వివిధ కేసులలో విచారణకు అనుమతి ఇవ్వడం, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారులు, పోలీసులపై నిర్ణయం తీసుకోవడంలో ఎల్‌జీకి విస్తృత అధికారాలు కల్పించింది.
అలాగే, అవినీతి నిరోధక బ్యూరోకు సంబంధించిన విషయాలతోపాటు అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయ అధికారుల నియామకాలకు కూడా ఎల్‌జీ ఆమోదం తప్పనిసరి చేసింది. అయితే, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని కాంగ్రెస్ విమర్శించింది. దీన్ని బట్టి జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సమీప భవిష్యత్లులో రాదని అర్థమవుతోందని విమర్శించింది. ఈ నిర్ణయం జమ్మూకశ్మీర్ ప్రజలను నిర్వీర్యం చేస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ తప్పుబట్టాయి.