Kejriwal: సుప్రీంలో కేజ్రీవాల్‌కు ఊరట లభిస్తుందా?
ABN , Publish Date - Aug 23 , 2024 | 09:59 AM
National: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపనుంది. లిక్కర్ కేసులో ఐదు నెలలుగా కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, ఆగస్టు 23: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో(Supreme Court) విచారణ జరుగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపనుంది. లిక్కర్ కేసులో ఐదు నెలలుగా కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో ముఖ్యమంత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Pharma company explosion: ఊపిరి తీసిన ‘ఆవిరి’!
అలాగే సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆగస్టు 14న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేసింది. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో బెయిల్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లిక్కర్ పాలసీ కుంభకోణం వెనుక ప్రధాన కుట్రదారు కేజ్రీవాలే అన్న సీబీఐ చెబుతోంది. ఎక్సైజ్ శాఖ తన వద్ద లేకపోయినా లిక్కర్ పాలసి గురించి కేజ్రివాల్ నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించింది.
AP-TG: ‘పొత్తు’ లాభం.. ఏపీకి దక్కిన రూ. 2,500 కోట్లు..
లిక్కర్ పాలసీ నిర్ణయాలు కేజ్రీవాల్ తీసుకున్నారని, ఆయన దర్యాప్తుకు సహకరించడం లేదని, దాటవేత సమాధానాలు ఇస్తున్నారని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలియజేసింది. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 26న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అయితే సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో సీఎం కేజ్రీవాల్ ఇంకా తీహార్ జైలులోనే ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. మరి ఈరోజు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు బెయిల్ లభించనుందా? లేదా? అనే ఉత్కంఠ సర్వాత్రా నెలకొంది.
ఇవి కూడా చదవండి..
Kaleshwaram project: సంతకాల కోసం కేసీఆర్, హరీశ్ ఒత్తిడి చేశారు..
Mike Lynch: బ్రిటన్ 'బిల్ గేట్స్' సహా ఐదుగురి మృతి.. కుమార్తె కోసం కొనసాగుతున్న అన్వేషణ
Read Latest National News And Telugu News