Share News

AP Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఇకపై ఒకే సిలబస్

ABN , Publish Date - Aug 23 , 2024 | 09:17 AM

ఏపీలో ఇంటర్మీడియట్‌లో పరీక్షల విధానం మొత్తాన్ని ప్రక్షాళన చేసే దిశగా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఎవరికి వారే అన్నట్లుగా కాలేజీల స్థాయిలో అంతర్గత పరీక్షలు జరుగుతున్నాయి. ఆయా కాలేజీలను నిర్దేశించకున్న పాఠ్యంశాలపై వారే నిర్ణయించుకున్న తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

AP Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఇకపై ఒకే సిలబస్

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌లో పరీక్షల విధానం మొత్తాన్ని ప్రక్షాళన చేసే దిశగా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఎవరికి వారే అన్నట్లుగా కాలేజీల స్థాయిలో అంతర్గత పరీక్షలు జరుగుతున్నాయి. ఆయా కాలేజీలను నిర్దేశించకున్న పాఠ్యంశాలపై వారే నిర్ణయించుకున్న తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు ఏ విద్యార్థి సామర్థ్యం ఏంటి..? ఎంత మెరుగ్గా ఉన్నారు..? ఎంతమంది చదువులో వెనుకబడ్డారు...? అనే అంచనా లేదు. పాఠశాల విద్యాశాఖలో అకడమిక్ క్యాలెండర్ విధానం అమల్లో ఉంది. ఏ నెలలో పాఠాలు చెప్పాలి.


ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ప్రతి ఏడాది ఆ శాఖ క్యాలెండర్ విడుదల చేస్తుంది. ఇక ఇంటర్‌లోనూ సంక్షిప్తంగా అకడమిక్ క్యాలెండర్ తయారు చేస్తున్నారు. అయితే అందులో పరీక్షల తేదీలపై తప్ప సిలబస్‌పై స్పష్టత లేదు. దీంతో కళాశాలన్నీ వేర్వురుగా పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి. ఇకపై అంతర్గత పరీక్షలు కామన్‌గా నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై ఇంటర్ విద్యామండలి అధికారులు టైమ్ టేబుల్‌ను రూపొందించారు. ఇవాళ దీనిని విడుదల చేయనున్నారు.


ఇక ఏపీలో 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ లాంటి గ్రూపులతో పాటు కొన్ని వృత్తి విద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో సుమారు రెండు లక్షలకు పైగా చదువుతున్నారు. పాఠశాల విద్యా తరహాలోనే ప్రతి ఏడాది అకడమిక్ క్యాలెండర్ ఇంటర్‌లోనూ తయారు చేస్తున్నారు. ఇంటర్ విద్యామండలి రూపొందించిన కొత్త టైం టేబుల్‌ను తేదీలతో పాటు ఏ నెలలో ఏయే పాఠాలు చెప్పాలి. అనే వివరాలు కూడా పొందుపరిచింది.


ఫైనల్ పరీక్షలు కాకుండా సంవత్సరంలో నాలుగు యూనిట్ పరీక్షలు క్వార్టర్లీ , ఆఫ్‌ఎర్లీ ఫ్రీఫైనల్ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది ఇప్పటికే యూనిట్-1 పరీక్షలు పూర్తి అయ్యాయి. యూనిట్ - 2 నుంచి కాలేజీలు ఒకే సిలబస్ ఫాలో అయ్యేలా నూతన విధానం అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు కాలేజీలే ప్రశ్నాపత్రాలు తయారు చేస్తున్నాయి. ఇకపై ఇంటర్ బోర్డే అన్ని పరీక్షలకు ప్రశ్నాపత్రాలు పంపుతుంది. పరీక్షలు జరిగే రోజు ఉదయం కాలేజీల ప్రిన్సిపాళ్లకు పేపర్లు పంపుతారు.

Updated Date - Aug 23 , 2024 | 09:21 AM