Delhi: పోర్న్ వీడియోలు చూపి అసభ్యంగా తాకారు!
ABN , Publish Date - Jul 20 , 2024 | 04:29 AM
జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ కుమార్ తనకు పోర్న్ వీడియోలు చూపి లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఆ సంస్థ వ్యవస్థాపకుడు నవీన్ జిందాల్‌కు ‘ఎక్స్’ వేదికగా ఫిర్యాదు చేశారు. విమానంలో తన పట్ల జరిగిన దారుణాన్ని ఆమె ఓ పోస్టులో వివరించారు. ‘
విమానంలో మహిళకు ‘జిందాల్’ సీఈవో వేధింపులు
సంస్థ వ్యవస్థాపకుడు నవీన్‌కు బాధితురాలి ఫిర్యాదు..
న్యూఢిల్లీ, జూలై 19: జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ కుమార్ తనకు పోర్న్ వీడియోలు చూపి లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఆ సంస్థ వ్యవస్థాపకుడు నవీన్ జిందాల్‌కు ‘ఎక్స్’ వేదికగా ఫిర్యాదు చేశారు. విమానంలో తన పట్ల జరిగిన దారుణాన్ని ఆమె ఓ పోస్టులో వివరించారు. ‘కోల్‌కతా నుంచి అబుధాబి వెళ్తున్న విమానంలో నా పక్కనే దినేశ్ కూర్చొన్నారు. నాతో మాటలు కలిపిన ఆయన తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు.
సినిమాలు చూడటమంటే ఇష్టమేనా అని అడుగుతూ ఫోన్లో పోర్న్ వీడియోలు చూపుతూ నన్ను అసభ్యంగా తాకారు. దీంతో షాక్‌కు గురైన నేను వాష్‌రూమ్ వద్దకు వెళ్లి విమాన సిబ్బందికి విషయం చెప్పాను. వారు నన్ను మరో చోట కూర్చొబెట్టి జాగ్రత్తగా చూసుకున్నారు. అప్పటికీ నేను ఎక్కడికెళ్లానంటూ నా గురించి సిబ్బందితో ఆయన ఆరా తీస్తూనే ఉన్నారు. విమానం ల్యాండ్ అవగానే అక్కడి పోలీసులకు కూడా విమాన సిబ్బంది ఫిర్యాదు చేశారు.
పోలీసులు దీనిపై ఆయన్ను ప్రశ్నించినప్పుడు కూడా కాదని ఖండించలేదు. ఇది ఎవరికైనా జరగొచ్చు. అందుకే మీ దృష్టికి తెస్తున్నాను.. ఈ వ్యక్తి సంస్థలోని మహిళా ఉద్యోగుల పట్ల ఏ విధంగా ప్రవరిస్తున్నాడో..?’ అని పేర్కొంటూ నవీన్ జిందాల్ ఖాతాకు ట్యాగ్ చేశారు. మహిళ ఫిర్యాదుపై నవీన్ జిందాల్ స్పందించారు. ‘మీరు చేసిన పనికి ధన్యావాదాలు.. దీనికి చాలా ధైర్యం కావాలి. ఈ ఘటనపై వెంటనే దర్యాపు చేయాల్సిందిగా మా బృందాన్ని కోరతా. అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హామీనిచ్చారు.