Delhi: ఐటీ నగరిలో పేలుడు.. దేశ రాజధాని అప్రమత్తం.. ఆ చర్యలకు అధికారుల సంసిద్ధం..
ABN , Publish Date - Mar 02 , 2024 | 12:48 PM
బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటనలో దేశ రాజధాని దిల్లీ ( Delhi ) అప్రమత్తమైంది. ఐటీ నగరిలో పేలుడు సంభవించి 10 మంది గాయపడిన ఘటనతో దిల్లీలో అధికారులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. సాధారణ బందోబస్తు, పెట్రోలింగ్ ను పెంచారు.
బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటనలో దేశ రాజధాని దిల్లీ ( Delhi ) అప్రమత్తమైంది. ఐటీ నగరిలో పేలుడు సంభవించి 10 మంది గాయపడిన ఘటనతో దిల్లీలో అధికారులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. సాధారణ బందోబస్తు, పెట్రోలింగ్ ను పెంచారు. సరోజినీ నగర్, లజ్‌పత్ నగర్, హౌజ్ ఖాస్, పహర్‌గంజ్ మార్కెట్‌లలో పోలీసులు పహారా కట్టుదిట్టం చేశారు. మార్కెట్ కు వచ్చే వినియోగదారులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. అనుమానాస్పద వస్తువులు గానీ, వ్యక్తులు గానీ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి తాము బందోబస్తు పెంచినట్లు ఓ అధికారి తెలిపారు. కొన్నేళ్లుగా దేశ రాజధానిని కుదిపేస్తున్న ఐఈడీ ఘటనల కారణంగా దిల్లీ పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు.
మరో వైపు.. శుక్రవారం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఐఈడీ పేలుడుపై కేఫ్ యజమానులు స్పందించారు. బ్రూక్‌ఫీల్డ్ బ్రాంచ్‌లో జరిగిన పేలుడు పట్ల తాము చాలా ఆవేదనకు గురయ్యామని, దర్యాప్తులో అధికారులకు సహకరిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలకు ఈ పేలుడు జరిగింది. ఓ అనుమానితుడు కేఫ్‌లో బ్యాగ్‌ను ఉంచినట్లు చూపిస్తున్న సీసీ ఫుటేజీతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.