Share News

National : ఫ్లిప్‌కార్ట్‌ పేరుతో.. నయా మోసం.. నమ్మి నిండా మునిగిన యువకుడు..

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:24 PM

ఇన్నాళ్లూ వాట్సాప్ లింకులు, ఫ్రాడ్ కాల్స్, పార్ట్ టైం జాబ్స్, జాబ్స్ స్కామ్ పేరిట సైబర్ మోసాలు జరగడం చూసే ఉంటారు. ప్రజల్లో ఆయా నేరాలపై కాస్త అవగాహన కలిగిన వెంటనే.. కొత్త మార్గాల్లో జనాలను సొమ్ము దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరిట కోట్లు నొక్కేసిన సైబర్ మాయగాళ్లు.. ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తారు. పంజాబ్‌లో జరిగిన ఆ ఘటన..

National : ఫ్లిప్‌కార్ట్‌ పేరుతో.. నయా మోసం.. నమ్మి నిండా మునిగిన యువకుడు..
Loan Related Cyber Fraud

ఏటికేడు సైబర్ నేరాల కేసులు పెరుగుతుండటంతో బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మునూ రక్షించుకోలేక నానా తంటాలు పడుతున్నారు ప్రజలు. జీవితకాలం ధారపోసి కూడబెట్టిన సొమ్మును ఒకే ఒక్క కాల్ లేదా క్లిక్‌తో ఇట్టే కొల్లగొట్టేస్తున్నారు సైబర్ మాయగాళ్లు. ఇన్నాళ్లూ వాట్సాప్ లింకులు, ఫ్రాడ్ కాల్స్, పార్ట్ టైం జాబ్స్, జాబ్స్ స్కామ్ పేరిట సైబర్ మోసాలు జరగడం చూసే ఉంటారు. ప్రజల్లో ఆయా నేరాలపై కాస్త అవగాహన కలిగిన వెంటనే.. కొత్త మార్గాల్లో జనాలను సొమ్ము దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరిట ఈడీ, సీబీఐ, జడ్జీ అంటూ నయా అవతారమెత్తి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కోట్లు నొక్కేసారు. ఇప్పుడు వీటికి భిన్నంగా మరో కొత్త తరహా నేరానికి తెర తీశారు సైబర్ నేరగాళ్లు. ఇప్పటివరకూ వృద్ధులు, మహిళలే లక్ష్యంగా దాడి చేసిన సైబర్ మోసగాళ్లు ఇప్పుడు చదువుకున్న వారినీ బురిడీ కొట్టించేస్తున్నారు. ఏఐ సాయంతో ప్రతిఒక్కరినీ ర్యాండమ్‌‌గా టార్గెట్ చేయడం ప్రారంభించారు. అలా ఈ మధ్య పంజాబ్‌లో ఓ విభిన్న సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ప్రజలు రోజూ వాడే యాప్‌లలో ఒకటైన ప్రముఖ షాపింగ్ యాప్ ఫ్లిప్‌కార్ట్ పేరిట ఊహించని విధంగా మోసానికి పాల్పడ్డారు.


ఇప్పటివరకూ పార్ట్ టైం జాబ్స్, జాబ్ స్కాం వెబ‌్‌సైట్‌ల పేరిట సైబర్ మోసాలకు బలయ్యారు నిరుద్యోగ యువత. ఐటీ ప్రొఫెనల్స్‌నూ తెలివిగా బోల్తా కొట్టించి దోచేసిన కేసులూ బోలెడు. ఇటీవల విభిన్న తరహా సైబర్ నేరంగా సెన్సేషన్ సృష్టించిన డిజిటల్ అరెస్ట్ తర్వాత పంజాబ్‌లో మరో నయా సైబర్ ఘటన జరిగింది. లోన్‌కు దరఖాస్తు చేసుకున్న యువకుడిని ఫ్లిప్‌కార్ట్ పేరిట దగా చేసి బ్యాంకు ఖాతా ఊడ్చేశారు.


పంజాబ్ లుథియానా జిల్లాలోని కైల్లీ గ్రామానికి చెందిన పోస్ట్‌మాస్టర్‌ సరబ్‌జీత్‌సింగ్ లోన్ సంబంధిత సైబర్ మోసానికి బలయ్యాడు. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో రూ.2 లక్షలకు లోన్ అప్లె చేసుకున్న సరబ్‌జీత్‌‌కు..యాప్ నుంచి అంటూ కొన్ని రోజుల తర్వాత ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. మీ లోన్ అప్రూవ్ అయ్యింది. KYC వివరాల వెరిఫికేషన్ పూర్తిచేయడానికి ఈ లింక్‌ని, ఆన్‌లైన్ KYC దరఖాస్తును పూర్తి చేయండని చెప్పడంతో అలాగే చేశాడు. వెరిఫికేషన్ ఫైనలైజ్ కావాలంటే ఫీజు కింద రూ.5 కట్టాల్సి ఉంటుందని చెప్పి బ్యాంకు నుంచి రూ.86,998 కట్ చేయడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు సరబ్‌జీత్‌‌. తిరిగి కాల్ చేస్తే కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఆ మోసగాడు. వెంటనే ఈ లోన్ సైబర్ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెన్సేషన్‌గా మారింది.


ఇలాంటి మోసాలకు బలికాకుండా ఉండాలంటే పరిచయం లేని కాలర్లు, అనుమానాస్పద లింక్‌ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో KYC వివరాలు, పేమెంట్లు చేయమని అడుగుతుంటే అస్సలు నమ్మకండి. మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యక్తులకు చెప్పకండి. లావాదేవీలను నిర్వహించడానికి అధికారిక బ్యాంకింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఉపయోగించడమే సురక్షితం. లోన్ల కోసం ఫ్లిప్‌కార్ట్ వంటి థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా కాకుండా అధికారిక బ్యాంకుల నుంచే రుణాలు తీసుకోవడం ఉత్తమం.

Updated Date - Dec 31 , 2024 | 01:27 PM