Haryana: క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్న హర్యానా ఫలితం.. హంగ్ దిశగా..
ABN , Publish Date - Oct 08 , 2024 | 10:41 AM
Haryana Election Results: హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణం క్షణం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హంగ్ అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికారం కోసం 46 సీట్లు అవసరం కాగా.. ప్రస్తుత సరళి చూస్తుంటే ఏ పార్టీకి మెజార్టీ దక్కేలా కనిపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతోంది.
Haryana Election Results: హర్యానాలో ఓట్ల లెక్కింపు క్షణం క్షణం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హంగ్ అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికారం కోసం 46 సీట్లు అవసరం కాగా.. ప్రస్తుత సరళి చూస్తుంటే ఏ పార్టీకి మెజార్టీ దక్కేలా కనిపించడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతోంది. మొదట కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చగా.. ఆ తర్వాత కొంచెం వెనుకబడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. జమ్మూ, కశ్మీర్‌లో హంగ్ వచ్చే అవకాశం ఉందని, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా అంటూ అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జమ్మూ కశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్సీ-కాంగ్రెస్ కూటమి 50కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. కశ్మీర్‌లో ఎన్సీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తుండగా.. పీడీపీ మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదనే విషయం స్పష్టమవుతోంది. ఇతరులు మాత్రం 10 నుంచి 15 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇక హర్యానా విషయానికి వస్తే ప్రస్తుత ఫలితాల సరళిని చూస్తే బీజేపీ 46 సీట్లలో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 38 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీఎస్పీ, ఐఎన్‌ఎల్‌డి కూటమి కేవలం రెండు సీట్లలో, ఇతరులు నాలుగు సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీజేపీకి సీట్లు తగ్గితే ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు. ఈ సమయంలో రెండు నుంచి మూడు సీట్లు గెలుచుకునే పార్టీ, ఇతరులు కీలకం కానున్నారు.
పోటాపోటీ..
హర్యానాలో ఫలితాల సరళిని చూస్తే బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచినట్లు అర్థమవుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ లీడ్‌లో ఉన్న 38 నియోజకవర్గాల్లో వెయ్యి లోపు ఆధిక్యంలో ఉన్న స్థానాలు దాదాపు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ వెయ్యిలోపు ఆధిక్యంలో ఉన్న స్థానాలు పది ఉన్నాయి. కర్నాల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జగన్మోహన్ ఆనంద్ 4వేలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. జులానాలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో స్వల్ప ఆధిక్యత ఉన్న ఫోగట్.. రెండో రౌండ్ ముగిసే సమయానికి 2వేల128 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ ఫోగట్‌పై ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.
ఆప్ ఓట్లు చీల్చిందా..
ఆప్ హర్యానాలో ఖాతా తెరవకపోయినా.. ఓట్లు భారీగా చీల్చినట్లు తెలుస్తోంది. దీంతో మెజార్టీకి అవసరమైన సీట్లను కాంగ్రెస్ గెలుచుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మొదట కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేయాలని భావించినా.. చివరి నిమిషంలో పొత్తు కుదరలేదు. దీంతో ఆప్ ఒంటరిగా పోటీచేసింది. బీజేపీ హర్యానాలో ఘోరంగా ఓడిపోతుందని దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగినా.. బీజేపీ మాత్రం తన బలాన్ని నిలుపుకున్నట్లు ఫలితాల సరళి చూస్తే అర్థమవుతోంది.
Also Read:
శ్రీవారి నెయ్యి నాణ్యతపై 1019లోనే విచారణ.. తేడా వచ్చిందో..
హర్యానా ఫలితాల్లో బిగ్ ట్విస్ట్
కన్నతల్లి ప్రాణాలు కాపాడిన పసిపాప.. గుండెలు పిండేసే
For More National News and Telugu News..