Share News

Mallikarjun Kharge : లీకేజీ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య!

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:14 AM

కేంద్ర ప్రభుత్వం పేపర్‌ లీక్‌ చట్టాన్ని అమల్లోకి తేవడం కంటితుడుపు చర్య అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Mallikarjun Kharge : లీకేజీ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య!

ఫిబ్రవరిలోనే ఎందుకు తేలేదు?

నోటిఫై చేశామని అబద్ధాలెందుకు?

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

పరీక్షల అక్రమాల చట్టం కంటి తుడుపు చర్య: ఖర్గే

న్యూఢిల్లీ, జూన్‌ 22: కేంద్ర ప్రభుత్వం పేపర్‌ లీక్‌ చట్టాన్ని అమల్లోకి తేవడం కంటితుడుపు చర్య అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం గత ఫిబ్రవరిలోనే లభిస్తే ఇప్పటిదాకా ఎందుకు అమల్లోకి తేలేదని ప్రశ్నించారు. విద్యారంగంలో మాఫియాను, అవినీతిని ప్రోత్సహిస్తున్నందుకు బీజేపీ బాధ్యత నుంచి తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు.

పరీక్షల అక్రమాలకు పాల్పడిన వారికి పదేళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా నిబంధనలతో శుక్రవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పరీక్షల అక్రమాల నిరోధక చట్టం-2024ను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు స్పందించారు. గత ఏడేళ్ల బీజేపీ పాలనలో మొత్తం 70 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని ఆరోపించారు. వీటిపై ఇప్పటిదాకా బీజేపీ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. కాగా, నీట్‌ లీకేజీ అంశంపై శనివారం తాజాగా పది మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐ, ఈడీకి అప్పగించేలా ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారు.

Updated Date - Jun 23 , 2024 | 04:16 AM