Share News

Cyber Crime: సైబర్‌ మోసగాళ్లతో జాగ్రత్త!

ABN , Publish Date - Jul 15 , 2024 | 03:55 AM

పోలీసు విభాగాలు, దర్యాప్తు సంస్థల పేరిట సైబర్‌ మోసగాళ్లు నకిలీ ఈ మెయిళ్లు, నోటీసులు పంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోంశాఖకు చెందిన ‘ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌’ (ఐ4సీ) ప్రజలకు సూచించింది.

Cyber Crime: సైబర్‌ మోసగాళ్లతో జాగ్రత్త!

  • పోలీసు, నిఘా, దర్యాప్తు సంస్థల పేరిట నకిలీ ఈమెయిళ్లు

  • వాటికి స్పందించవద్దు

  • 1930కి ఫోన్‌ చేసి తెలియజేయాలి: కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ, జూలై 14: పోలీసు విభాగాలు, దర్యాప్తు సంస్థల పేరిట సైబర్‌ మోసగాళ్లు నకిలీ ఈ మెయిళ్లు, నోటీసులు పంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోంశాఖకు చెందిన ‘ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌’ (ఐ4సీ) ప్రజలకు సూచించింది. ఈ తరహా మెయిళ్లు వచ్చినప్పుడు.. అవి నిజంగానే ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి వచ్చాయా? అని తెలుసుకోవటానికి ఆ వెబ్‌సైట్‌ చివర జౌఠి.జీుఽ ఉందా అనేది చూడాలని పేర్కొంది. అలాగే, సదరు మెయిల్‌లో ప్రస్తావించిన అధికారుల గురించి సమాచారం, వారి వివరాలను ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి తెలుసుకోవాలని, సంబంధిత ప్రభుత్వ విభాగానికి ఫోన్‌ చేసి ఈ మెయిల్‌ గురించి తెలియజేయాలని సూచించింది.


ఈ మేరకు ఐ4సీ ఆదివారం ఒక ప్రకటన జారీ చేసింది. అనుమానాస్పద ఈమెయిళ్లు వచ్చినప్పుడు, ఇతరత్రా సైబర్‌ మోసాలు జరిగినప్పుడు వెంటనే ప్రజలు అప్రమత్తమై ఠీఠీఠీ.ఛిడఛ్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీుఽ కు, లేదా సైబర్‌ క్రైం హెల్ప్‌ నంబరు 1930కి సమాచారం అందించాలని తెలిపింది. కాగా, ఈ నెల ఆరంభంలోనూ కేంద్ర ఆర్థికశాఖ ఒక సూచన జారీ చేసింది. ఢిల్లీ పోలీసు సైబర్‌ క్రైమ్‌ అండ్‌ ఎకనామిక్‌ అఫెన్స్‌, సెంట్రల్‌ ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఢిల్లీ సైబర్‌ సెల్‌ పేర్లతో, ఆయా సంస్థల లోగోలతో, అధికారుల సంతకాలత పంపిస్తున్నారని పేర్కొంది. దీంతోపాటు ఒక అటాచ్‌మెంట్‌ కూడా పంపుతున్నారని.. చైల్డ్‌ పోర్నోగ్రఫీ, సైబర్‌ పోర్నోగ్రఫీ వంటి నేరాలకు పాల్పడ్డావంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ తరహా మెయిళ్లు వచ్చినప్పుడు వాటికి ప్రతిస్పందించవద్దని, వీటి గురించి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది. ఢిల్లీలోని సెంట్రల్‌ సెక్రటేరియట్‌లో పని చేసే ఉద్యోగులకు కూడా గత వారం అనుమానాస్పద ఈమెయిళ్లు వచ్చాయి.

Updated Date - Jul 15 , 2024 | 03:55 AM