The Kerala Story: ఆ సినిమా ప్రదర్శనలను ఆపేయండి.. ముఖ్యమంత్రి ఆర్డర్స్..
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:05 AM
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ది కేరళ ( Kerala ) స్టోరీ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా ప్రసారం చేయాలనే దూరదర్శన్ నిర్ణయాన్ని ఆయన ఖండించారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ది కేరళ ( Kerala ) స్టోరీ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా ప్రసారం చేయాలనే దూరదర్శన్ నిర్ణయాన్ని ఆయన ఖండించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం మత ఉద్రిక్తతలను రేకెత్తిస్తుందని చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ప్రచార మాధ్యమంగా దూరదర్శన్ మారవద్దని సూచించారు. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు విరమించుకోవాలని కోరారు. దురుద్దేశపూరిత ఆలోచనలు, నిర్ణయాలను వ్యతిరేకించడంలో కేరళ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
Navneeth Kaur: నా పుట్టుక గురించి ప్రశ్నించిన వారికి సమాధానం లభించింది.. ఎంపీ నవనీత్..
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేరళలో బీజేపీ పట్టు నిలుపుకునేందుకు ఈ వివాదాస్పద చిత్రాన్ని తెర మీదకు తీసుకువచ్చిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. సినిమా విడుదలైనప్పుడు కేరళలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. సినిమా నుంచి సెన్సార్ బోర్డు స్వయంగా 10 సన్నివేశాలు తొలగించింది. సినిమా ట్రైలర్‌లో ఏ ఒక్క వర్గానికి అభ్యంతరం కలిగించే అంశాలు లేవని పేర్కొంటూ సినిమా విడుదలపై స్టే విధించేందుకు గతేడాది కేరళ హైకోర్టు నిరాకరించడం గమనార్హం.
Congress: నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. వాటిపైనే ప్రధాన దృష్టి..
ది కేరళ స్టోరీ ట్రైలర్ లో కేరళకు చెందిన 32 వేల మహిళలు మతం మారారని, వారు తీవ్రవాదులుగా మారి భారత్ సహా ప్రపంచ దేశాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారని చూపించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. 2023 లో ఈ చిత్రం విడుదల కాగా సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు తీవ్ర నిరసనలు తెలిపాయి. సినిమా ప్రదర్శనలను ఆపివేయాలని డిమాండ్ చేశాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.