Share News

NDA Leaders Meeting: న్యూఢిల్లీలో ఎన్డీయే నేతల బేటీ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:30 PM

NDA Leaders Meeting: ఓ వైపు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలు. అలాంటి వేళ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నాయి. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యచరణపై వారు చర్చించనున్నారు.

NDA Leaders Meeting: న్యూఢిల్లీలో ఎన్డీయే నేతల బేటీ.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు
BJP Chief, Central MInister JP Nadda

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: మరికొద్ది మాసాల్లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశం కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో వీరంతా భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు లేదా సాయంత్రం 4.00 గంటలకు వీరు సమావేశమయ్యే అవకాశముందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సమావేశానికి టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం హాజరుకానున్నారు. అందుకోసం మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. అయితే ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలుతోపాటు పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, తదుపరి కార్యాచరణపై ఎన్డీయే నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది.

అలాగే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికల సంఘం తీసుకు వచ్చిన నూతన సంస్కరణలపై సైతం చర్చించే అవకాశముందని సమాచారం. మోదీ సారథ్యంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు అయింది. అనంతరం మూడోసారి ఎన్డీఏ నేతలు బుధవారం న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. అదే విధంగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా.. ఈ నేతలు సమావేశం అవుతున్నారు.


ఇక ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నత తరుణంలో.. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై సైతం ఈ భేటీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు చర్చించనున్నాయి. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన కొనసాగుతోంది. దీనిపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇంకోవైపు డిసెంబర్ 25వ తేదీ. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయ్ జయంతి. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని ఆయన సమాధికి సమీపంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం ఉదయం జరుగుతుంది. అనంతరం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశం కానున్నారు.

Also Read: రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజ్ కీలక ప్రకటన

Also Read: బెలగావి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు


ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో పలు విడతలుగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలను గెలుచుకొంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ (ఎస్), జేడీ (యూ), లోక్ జన శక్తి (రామ్ విలాస్ పాశ్వాన్) తదితర పార్టీల మద్దతు తీసుకుంది. దీంతో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ భాగస్వామ్య పక్షాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Also Read: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్

Also Read: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్

For National News And Telugu News

Updated Date - Dec 24 , 2024 | 06:31 PM