Lalu Yadav: అది నరేంద్ర మోదీ ఓటమే.. హర్యానా ఎగ్జిట్ పోల్స్‌పై లాలూ
ABN , Publish Date - Oct 06 , 2024 | 08:50 PM
భూములకు ఉద్యోగాల కుంభకోణంలో ఢిల్లీ కోర్టు ముందు లాలూ ప్రసాద్ సోమవారంనాడు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడారు.
పాట్నా: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) కాంగ్రెస్ (Congress) పార్టీ మెజారిటీ సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేయడంపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) స్పందించారు. దీనిని నరేంద్ర మోదీ ఓటమి గానీ చూడాల్సి ఉంటుందని అన్నారు. భూములకు ఉద్యోగాల (Land for jobs) కుంభకోణంలో ఢిల్లీ కోర్టు ముందు లాలూ ప్రసాద్ సోమవారంనాడు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడారు.
Mamata Banerjee: అత్యాచార కేసుల్లో మీడియో ట్రయిల్స్ అపండి
లాలూ వెంట ఆన పెద్ద కుమార్తె, లోక్‌సభ ఎంపీ మిసా భారతి కూడా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఆమె సైతం స్పందిస్తూ, చాలావరకూ ఎగ్జిట్ పోల్స్ ఆర్జేడీ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి బీజేపీ నుంచి పగ్గాలు అందుకోనుందంటూ అంచనా వేశాయన్నారు. ఇది తమ పార్టీ భాగస్వామిగా ఉన్న 'ఇండియా' కూటమి విజయంగా తాను భావిస్తున్నానని అన్నారు. హర్యానాలో ప్రజాపాలన రాబోతోందన్నారు.
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం వరుసగా రెండు సార్లు అధికారంలో కొనసాగగా, ఈసారి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతోందంటూ పలు ఎగ్జిట్ పోల్స్ శనివారంనాడు అంచనా వేశాయి. కాంగ్రెస్ సుమారు 59 సీట్లు గెలిచి అధికారలోకి రాబోతోందని 'యాక్సిస్ మై ఇండియా' వెల్లడించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 8న వెలువడనున్నాయి.