National Politics: కలిసే ఉన్నాం.. న్యాయ్ యాత్రకు డుమ్మా కొట్టడంపై అఖిలేశ్ యాదవ్
ABN , Publish Date - Feb 21 , 2024 | 04:07 PM
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతోందని సమాజ్ వాదీ పార్టీ మరోసారి స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీతో సీట్లపై చర్చలు జరుగుతున్నాయని వివరించింది.
లక్నో: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతోందని సమాజ్ వాదీ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీతో (Congress) సీట్లపై చర్చలు జరుగుతున్నాయని వివరించింది. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలి, అమేథి నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర కొనసాగింది. రాహుల్ యాత్రలో పాల్గొంటానని అంతకుముందు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. యాత్ర సమయంలో మాత్రం కనిపించలేదు. దీంతో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీ చేస్తాయా..? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Chennai: ఇండియా కూటమిలో లేను.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు
కుదరని ఏకాభిప్రాయం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 లోక్ సభ సీట్లు ఉన్నాయి. తమకు 28 సీట్లు కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టు బడుతోంది. 17 నుంచి 19 సీట్లు ఇస్తామని ఎస్పీ తెగేసి చెబుతోంది. సీట్ల అంశంపై ఇరుపార్టీల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదు. ఆ సమయంలో రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేశ్ యాదవ్ పాల్గొనకపోవడం సందేహాలకు తావిచ్చింది. ‘ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్- ఎస్పీ కూటమి కలిసి పనిచేస్తోంది. ఇక్కడ అంతా బాగానే ఉంది. ఇరు పార్టీల మధ్య విభేదాలు ఏమి లేవు అని’ అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Chennai: ఇండియా కూటమిలో లేను.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు
31 చోట్ల అభ్యర్థుల ఖరారు
కాంగ్రెస్ పార్టీని సంప్రదించకుండానే 31 స్థానాలకు అభ్యర్థులను ఎస్పీ ఖరారు చేసింది. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చిన్నాన్న శివపాల్ యాదవ్ భూదౌన్ స్థానం నుంచి బరిలోకి దిగుతారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారాణాసి నుంచి సురేంద్ర సింగ్ పటేల్ పేరును ఖరారు చేశారు. కైరానా నుంచి ఇక్రా హసన్, బరేలి నుంచి ప్రవీణ్ సింగ్ ఆరొన్, హమీర్ పూర్ నుంచి అజేంద్ర సింగ్ రాజ్‌పుత్ బరిలోకి దిగుతారని ప్రకటించారు. తమను సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించడంతో ఎస్పీపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: Chennai: ఇండియా కూటమిలో లేను.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు