Shimla : ఉత్తరాదిలో వర్ష బీభత్సం.. 28 మంది మృతి
ABN , Publish Date - Aug 12 , 2024 | 03:03 AM
కుండపోత వర్షాలతో ఉత్తరాది అతలాకుతలమవుతోంది. ఆదివారం ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి.
సిమ్లా, చండీగఢ్, ఆగస్టు 11: కుండపోత వర్షాలతో ఉత్తరాది అతలాకుతలమవుతోంది. ఆదివారం ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి. ఉత్తరాదిలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 28 మంది మరణించారని తెలుస్తోంది.
భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలివేసినట్లు జమ్మూకశ్మీర్ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో హిమాచల్‌ప్రదేశ్ వణికిపోతోంది. రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు 280పైగా రోడ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో శనివారం ఒక రోజే 150పైగా రోడ్లను మూసివేశారు.