Sumalatha: బీజేపీలో చేరుతున్నా.. ఆయనకు మద్దతిస్తున్నా..
ABN , Publish Date - Apr 03 , 2024 | 06:36 PM
కర్ణాటకలోని మండ్య నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన సుమలత అంబరీష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ( Lok Sabha Elections ) టికెట్ ఆశించి భంగపడిన సుమలత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
కర్ణాటకలోని మండ్య నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన సుమలత అంబరీష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ( Lok Sabha Elections ) టికెట్ ఆశించి భంగపడిన సుమలత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, బీజేపీ-జేడీ(ఎస్) కూటమి బలపరిచిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో తాను పోటీ చేయనప్పటికీ మండ్యను వీడనన్నారు. టికెట్ రాకపోవడంతో కొందరు పార్టీ వీడాలని నిర్ణయించుకున్నా తాను మాత్రం సీటును వదులుకుని బీజేపీలో చేరాలని డిసైడ్ అయినట్లు వివరించారు.
Crime News: మరీ ఇలా ఉన్నాడేంట్రా బాబూ.. టిక్కెట్ అడిగాడని టీటీఈనే రైలు నుంచి తోసేశాడు..
“నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే అది నేనేంటో నేను నిరూపించుకోవడమే అవుతుంది. దీని వల్ల ఎవరికి లాభం. కాబట్టి నేను స్వప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. మండ్య ప్రజలతో కలిసి ఉండాలని మాత్రమే నిర్ణయించుకున్నా. మండ్య టికెట్ బదులు బెంగళూరు నార్త్, చిక్ బళ్లాపూర్, మైసూర్-కొడగులో పోటీ చేయమని నాకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది. కానీ నేను వాటికి తలొగ్గలేదు. అన్నింటినీ తిరస్కరించాను."
- సుమలత, మండ్య ప్రస్తుత ఎంపీ
Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. పిటిషన్ విచారణపై కోర్టు ఏమందంటే..
తన భర్త, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ మృతితో మండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో సుమలత పోటీ చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు నిఖిల్ కుమారస్వామిపై 1.25 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.