Share News

Supreme Court: మధ్యంతర బెయిల్‌ 7 రోజులు పొడిగించాలన్న కేజ్రీవాల్..షాకిచ్చిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - May 29 , 2024 | 11:55 AM

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) షాక్ ఇచ్చింది. సీఎం కేజ్రీవాల్ హెల్త్ చెకప్ కోసం మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది.

Supreme Court: మధ్యంతర బెయిల్‌ 7 రోజులు పొడిగించాలన్న కేజ్రీవాల్..షాకిచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court rejects Kejriwals plea

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) షాక్ ఇచ్చింది. సీఎం కేజ్రీవాల్ హెల్త్ చెకప్ కోసం మధ్యంతర బెయిల్‌ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుంది. అయితే సాధారణ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ కేజ్రీవాల్‌కు ఉన్నందున, పిటిషన్‌ను స్వీకరించలేమని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పష్టం చేసింది.


అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోగ్య కారణాలను పేర్కొంటూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో వెంటనే పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఆ తర్వాత మళ్లీ మధ్యంతర బెయిల్‌ గడువును పొడిగించాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున దరఖాస్తు చేసుకున్నారు. అయితే బుధవారం మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలన్న రిజిస్ట్రార్‌ దరఖాస్తును సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఆయన దరఖాస్తు తిరస్కరించబడింది.


కేజ్రీవాల్ అరెస్టు తర్వాత అతని బరువు 7 కిలోలు తగ్గానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ క్రమంలో తనకు కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని, కొన్ని తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్నాయని మ్యాక్స్ వైద్యులు చెప్పారని తెలిపారు. అందుకోసం కేజ్రీవాల్‌కు పీఈటీ-సీటీ స్కాన్‌తో పాటు పలు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో టెస్టుల కోసం కేజ్రీవాల్ 7 రోజుల సమయం కావాలని కోరారు. కానీ సుప్రీంకోర్టు అందుకు ఒప్పుకోలేదు. కేజ్రీవాల్ ప్రస్తుతం పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. మే 30న రాత్రి తిరిగి ఢిల్లీకి రానున్నారు.


ఇది కూడా చదవండి:

Remal Cyclone: రెమాల్ తుపాను ప్రభావంతో 27 మంది మృతి..రూ.15 కోట్లు ప్రకటించిన సీఎం

అందరి దృష్టీ ఆ పోరుపైనే!

Read Latest National News and Telugu News

Updated Date - May 29 , 2024 | 01:15 PM