Stock Market: 515 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..ఇవే టాప్ 5 లూజర్ స్టాక్స్
ABN , Publish Date - May 29 , 2024 | 11:12 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) ఈరోజు( మే 29న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. దాదాపు బెంచ్‌మార్క్ సూచీలు మొత్తం బుధవారం నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 10:58 గంటలకు, బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 515 పాయింట్లు క్షీణించి 74,655 వద్ద ట్రేడైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) ఈరోజు( మే 29న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. దాదాపు బెంచ్‌మార్క్ సూచీలు మొత్తం బుధవారం నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 10:58 గంటలకు, బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 515 పాయింట్లు క్షీణించి 74,655 వద్ద ట్రేడైంది. అదే సమయంలో NSE నిఫ్టీ 145 పాయింట్లు పడిపోయి 22,746.30 వద్దకు చేరుకుంది. అదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ 493 పాయింట్లు నష్టపోయి 48, 641కి చేరుకోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 121 పాయింట్లు తగ్గి 52164 స్థాయికి చేరుకుంది. అయితే బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు పలు కారణాల నేపథ్యంలో బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.55 శాతం క్షీణించగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.59 శాతం పడిపోయింది. ప్రస్తుతం SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC లైఫ్, UltraTechCement, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సంస్థల షేర్లు టాప్ 5 లూజర్లుగా ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిండాల్కో, నెస్లే, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్ కంపెనీల షేర్లు టాప్ 5 గెయినర్లుగా ఉన్నాయి.
దీంతోపాటు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 0.33 శాతం, కొరియా కోస్పి 0.95 శాతం క్షీణించాయి. మరోవైపు ఆస్ట్రేలియా ASX200 కూడా ఊహించిన దాని కంటే మెరుగైన CPI ద్రవ్యోల్బణం డేటా తర్వాత 0.95 శాతం తక్కువగా ట్రేడవుతోంది. US మార్కెట్లలో Nvidia స్టాక్‌లో 7 శాతం పెరుగుదల నేపథ్యంలో నాస్‌డాక్ మొదటిసారిగా 17,000 మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డును తాకింది. నాస్‌డాక్ 0.59 శాతం ఎగువన ముగిసింది. S&P 500 స్వల్ప పెరుగుదలను (0.02 శాతం) చూసింది, కానీ డౌ జోన్స్ 0.55 శాతం పడిపోయింది.
ఇది కూడా చదవండి:
Paytm: అదానీ గ్రూప్‌కు పేటీఎం వాటా విక్రయంపై కీలక ప్రకటన
Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest Business News and Telugu News