Share News

Viral Video: టగ్ ఆఫ్ వార్‌లో చైనా సైనికులపై భారత్ సైనికుల విజయం

ABN , Publish Date - May 29 , 2024 | 07:47 AM

భారత్(india), చైనా(china) సైనికుల మధ్య క్రీడ ఏదైనా తగ్గపోరు పోటీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్‌(tug of war)లో చైనా సైనికులను భారత ఆర్మీ సైనికులు చిత్తు చిత్తుగా ఓడించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: టగ్ ఆఫ్ వార్‌లో చైనా సైనికులపై భారత్ సైనికుల విజయం
Indian soldiers against Chinese soldiers

భారత్(india), చైనా(china) సైనికుల మధ్య క్రీడ ఏదైనా తగ్గపోరు పోటీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్‌(tug of war)లో చైనా సైనికులను భారత ఆర్మీ సైనికులు చిత్తు చిత్తుగా ఓడించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ కింద ఆఫ్రికాలోని సూడాన్‌(sudan)లో మోహరించిన సమయంలో భారత సైనికులు, చైనా సైనికుల మధ్య టగ్ ఆఫ్ వార్ ఆట నిర్వహించారు. ఆ క్రమంలో భారత్ సైనికులు చైనాపై విజయం సాధించారు.


అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. వీడియోలో రెండు దేశాల సైనికుల మధ్య టగ్ ఆఫ్ వార్ గేమ్ జరుగుతోంది. ఈ గేమ్‌ మే 28న ఆడినట్లు అధికారులు చెబుతున్నారు. వీడియోలో గెల్చిన భారత్ జట్టు సైనికులు సంబరాలు చేసుకోవడం చూడవచ్చు.

భారత్-ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం శక్తి ఏడవ ఎడిషన్ సోమవారం మేఘాలయలోని ఉమ్రోయ్ జాయింట్ ట్రైనింగ్ నోడ్‌లో ముగిసింది. ఇది భారత్, ఫ్రాన్స్ రెండింటిలోనూ ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే ద్వైవార్షిక శిక్షణా కార్యక్రమం. మునుపటి ఎడిషన్ నవంబర్ 2021లో ఫ్రాన్స్‌లో జరిగింది. రాజ్‌పుత్ రెజిమెంట్‌లోని 22వ బెటాలియన్‌కు చెందిన 90 మంది సిబ్బందితో కూడిన భారత ఆర్మీ బృందం ప్రాతినిధ్యం వహించింది.


ఇది కూడా చదవండి:

Remal Cyclone: రెమాల్ తుపాను ప్రభావంతో 27 మంది మృతి..రూ.15 కోట్లు ప్రకటించిన సీఎం

అందరి దృష్టీ ఆ పోరుపైనే!

Read Latest National News and Telugu News

Updated Date - May 29 , 2024 | 07:50 AM