Share News

Tamil Nadu: నీట్ ను నిషేధిస్తాం.. డీఎంకే మేనిఫెస్టోలో సంచలన ప్రకటనలు..

ABN , Publish Date - Mar 20 , 2024 | 02:08 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనితో పాటు ఎన్నికలకు అభ్యర్థుల జాబితానూ ప్రకటించింది. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కనిమొళితో పాటు ఇతర పార్టీ నేతలు ఉన్నారు.

Tamil Nadu: నీట్ ను నిషేధిస్తాం.. డీఎంకే మేనిఫెస్టోలో సంచలన ప్రకటనలు..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనితో పాటు ఎన్నికలకు అభ్యర్థుల జాబితానూ ప్రకటించింది. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కనిమొళితో పాటు ఇతర పార్టీ నేతలు ఉన్నారు. డీఎంకే తన మేనిఫెస్టోలో సంచలన ప్రకటనలు చేసింది. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాతో పాటు నీట్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చింది. గవర్నర్‌ పదవిని రద్దు చేసే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదించి గవర్నర్‌ను నియమించాలని పేర్కొంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అయిన నీట్ ను నిషేధిస్తాం అని మేనిఫెస్టోలో వెల్లడించారు. ఇది డీఎంకే మేనిఫెస్టో మాత్రమే కాదని ప్రజల మేనిఫెస్టో అని తమిళనాడు ( Tamil Nadu ) ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.

"2014లో బీజేపీ అధికారంలోకి రాగానే భారతదేశాన్ని నాశనం చేసింది. ఎన్నికల వాగ్దానాలు ఏవీ నెరవేర్చలేదు. ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నాం. 2024లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తాజా మేనిఫెస్టోలో ప్రతి జిల్లాకు పథకాలు అందించాం. "

- స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి


డీఎంకే మేనిఫెస్టోలో పలు కీలక వాగ్దానాలు చేసింది. అవేంటంటే.. పౌరసత్వ (సవరణ) చట్టం రూల్స్, యూనిఫాం సివిల్ కోడ్ రాష్ట్రంలో అమలు కావు. గవర్నర్లకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి మినహాయింపునిచ్చే ఆర్టికల్ 361 సవరణ, జాతీయ పుస్తకంగా తిరుక్కురల్‌, భారతదేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం, దేశవ్యాప్తంగా మహిళలకు ₹ 1000 నెలవారీ భత్యం, వంట గ్యాస్ రూ. 500, పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.65 కే అందిస్తామని డీఎంకే స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 02:08 PM